ప్రేమ వివాహం తమ కులం వారిని కాకుండా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మాజీ ఎంపీనే వెలివేశారు కులపెద్దలు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కులవ్యవస్థ పై ఏళ్లు పోరాటం చేసినా ..ఆర్ధికంగా ..టెక్నికల్ గా ..ఎన్ని రకాలుగా భారత్ ముందుకు వెళ్తున్నా...ఈ సామాజిక వర్గాల తేడాలను మాత్రం మార్చలేకపోతున్నాం, సాధారణ ప్రజలంటే వేరు..ఏకంగా ఎక్స్ ఎంపీ నే తమ కులం నుంచి 12 ఏళ్లు సంఘ బహిష్కరణ చేశారు కులపెద్దలు. కారణం ఏటంటే..ప్రేమ వివాహం తమ కులం వారిని కాకుండా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మాజీ ఎంపీనే వెలివేశారు కులపెద్దలు.
ప్రదీప్ మాఝీ కేంద్రపారా జిల్లాకు చెందిన సంగీతా సాహును మార్చి 12న గోవాలోని కేడినా హౌస్‌లో వివాహం చేసుకున్నారు. ప్రదీప్ మాఝీగిరిజనుడు కాగా సంతీగా సాహు గిరిజనేతర మహిళ. ప్రదీప్ గిరిజన అమ్మాయిని కాకుండా వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడానికి గిరిజన భత్ర సమాజ్ వ్యతిరేకించింది.ఈ వివాహం గిరిజన సమాజం పట్ల ద్వేషాన్ని పెంచిందని ఆరోపించింది. ప్రదీప్ పెళ్లి భారతీయ వాళ్ల సమాజాన్ని బాధ పెట్టిందని విమర్శించింది. ఈ క్రమంలో ప్రదీప్ సహా ఆయన కుటుంబాన్ని తమ కులం నుంచి 12 ఏళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
పెళ్లి డేట్ ఫిక్స్ కాగానే ..బరంగ్పుర్ జిల్లాలోని దబుగా బ్లాక్‌లోని ధమ్నాగూడలో గిరిజన భత్ర సమాజ్ కేంద్ర కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో బీజేడీ సీనియర్ నాయకుడు ప్రదీప్ మాఝీ వివాహం గురించి చర్చించారు. ఆ తర్వాత ప్రదీప్, ఆయన కుటుంబ సభ్యులను 12 ఏళ్లపాటు సామాజిక బహిష్కరణ చేశారు. "మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ గిరిజనేతర మహిళను వివాహం చేసుకున్నారు. అందుకే ఆయన్ను సంఘం నుంచి బహిష్కరించాం. ప్రదీప్, ఆయన కుటుంబాన్ని 12 ఏళ్ల పాటు మా సంఘం నుంచి బహిష్కరించాం" అని సొసైటీ అధ్యక్షుడు టికాచంద్ తెలిపారు.