Bigboss8:2nd వీక్ ఎలిమినేషన్..100% వారేనా.?

బిగ్ బాస్  సీజన్ 8 ప్రారంభమై ఈరోజుతో రెండు వారాలు గడిచిపోతున్నాయి. వచ్చిన రెండు వారాల్లోనే బిగ్ బాస్ మిగతా ఏ సీజన్ లో కూడా లేనంత రేటింగ్ సంపాదించిందని నాగార్జున స్వయంగా చెప్పారు.


Published Sep 15, 2024 08:29:58 AM
postImages/2024-09-15/1726369198_bigboss8.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్  సీజన్ 8 ప్రారంభమై ఈరోజుతో రెండు వారాలు గడిచిపోతున్నాయి. వచ్చిన రెండు వారాల్లోనే బిగ్ బాస్ మిగతా ఏ సీజన్ లో కూడా లేనంత రేటింగ్ సంపాదించిందని నాగార్జున స్వయంగా చెప్పారు.  దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ లే అని చెప్పవచ్చు.  మిగతా అన్ని సీజన్స్ లాగా కాకుండా ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. అన్  లిమిటెడ్ ఫన్ అన్ లిమిటెడ్ ప్రైజ్ మనీ అంటూ  కంటెస్టెంట్లను మరింత ఉత్సాహపరుస్తున్నాడు.

దీంతో కంటెస్టెంట్లు కూడా హౌస్ లో  వారి వారి పర్ఫామెన్స్ తో అందరినీ ఆనందపరుస్తున్నారు.  ఇలా హౌస్ లో మూడు మాటలు 6 కొట్లాటలుగా  కోలాహలంగా సాగుతోంది. ఇదే తరుణంలో ఈ వారం నామినేషన్స్ లో  ఆదిత్య ఓం, నైనిక, మణికంఠ, శేఖర్ భాష, విష్ణు ప్రియ, కిరాక్ సీత, నిఖిల్ ఈ వారం నామినేషన్స్ లిస్టులో ఉన్నారు.  ఈ నామినేషన్ అయిన వారికి ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం ఈ వారం  అత్యధిక ఓటింగ్  విష్ణు ప్రియ పడ్డట్టు తెలుస్తోంది. ఆ తర్వాత  స్థానంలో నిఖిల్ ఉన్నాడని ఆ తర్వాత నాగ మణికంఠ  నైనిక ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత స్థానంలో ఆదిత్య ఓం,  కిరాక్ సీత ఉన్నారట. ఈ విధంగా 8 మందిలో చివరి రెండు స్థానాల్లో ఉన్నది మాత్రం శేఖర్ బాషా కిరాక్ సీతా అన్నట్టు తెలుస్తోంది. అయితే తప్పకుండా హౌస్ నుంచి బయటకు వెళ్లే వారిలో  శేఖర్ బాషా లేదంటే  కిరాక్ సీత మొదటి స్థానంలో ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే హౌస్ లో వీరి పర్ఫామెన్స్  అభిమానులను అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇక ఇందులో కిరాక్ సీత  మరింత డల్ అయిపోయింది. కాబట్టి ఎక్కువ శాతం కిరాక్ సీతాకే తక్కువ ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna big-boos8 shekhar-bhasha vishnu-priya nainika pruthiraj

Related Articles