ఇప్పటికీ చాలా మంది తారలు ఒంటరిగానే ఉండిపోయారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఇండస్ట్రీ అంటేనే...అంత ...రంగుల ప్రపంచం ఆ రంగుల్లో మన అసలు రంగును మరిచిపోతాం. ఎన్ని రంగులు ఉన్నా ...వ్యక్తిగత జీవితం మాత్రం నలుపే అందులో రంగుల రంగుల జీవితం ఉండదు. అలాంటి జీవితమే ..సుస్మితాసేన్ లైఫ్.. ప్రేమ, పెళ్లి, బ్రేకప్ ఇప్పుడు సెలబ్రెటీల లైఫ్ లో కామన్ . ప్రేమలో విఫలమయ్యాక.. కొత్త జీవితం ఆరంభించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది తారలు ఒంటరిగానే ఉండిపోయారు.
ఆమె అందానికి ప్రపంచమే ఫిదా అయ్యింది. వెండితెరపై అగ్ర కథానాయికగా ఓ వెలుగింది. కానీ అప్పట్లో ఆమె పేరు ఎంతో మంది ప్రముఖులతో, వ్యాపారవేత్తలతో ముడిపడి ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 మందితో ప్రేమలో పడింది. ఏ ప్రేమ పెళ్లి వరకు రాలేదు. సుస్మితా సేన్ ..వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంది. ‘నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. మీరు జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా… ఆ నిర్ణయాలు బాధాకరంగా ఉంటాయి.
ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్, వ్యాపారవేత్తలతో 11 మందితో సుష్మిత డేటింగ్ చేసినట్లుగా టాక్ నడిచింది. మోడల్ రోహ్మాన్ షాల్ తో ఈ హీరోయిన్ ఎక్కువగా కనిపించింది. మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న సుస్మితా సేన్ వెండితెర పై అగ్రకథానాయికగా దూసుకుపోయింది. 24 ఏళ్ల వయసులోనే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది. మరో పిల్లని దత్తత తీసుకొని ప్రస్తుతం లైఫ్ లీడ్ చేస్తుంది.