పెద్దల సమక్షంలో తిరిగి కలుసుకున్నారు. కాని ఈ సారి మాత్రం విడికులు తీసుకున్నట్లు డైరక్ట్ గా ప్రకటించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నటుడు ధనుష్ ఐశ్వర్య జంట విడాకుల కేసు విషయమై కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ఇచ్చిన తీర్పు ఫుల్ వైరల్ అవుతుంది. నటుడు ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. 18 ఏళ్ల తర్వాత, 2022లో వీరు విడిపోతున్నట్టు ప్రకటించారు. ఒకటి రెండు సార్లు విడిపోయే వరకు వచ్చినా ...పెద్దల సమక్షంలో తిరిగి కలుసుకున్నారు. కాని ఈ సారి మాత్రం విడికులు తీసుకున్నట్లు డైరక్ట్ గా ప్రకటించారు.
ఇంతకు ముందు రెండు సార్లు విచారణకు వచ్చినప్పుడు ధనుష్, ఐశ్వర్య కోర్టుకు రాలేదు. దీంతో వీరు మళ్ళీ కలిసి ఉంటారని ప్రచారం జరిగింది. 'వేటతైయన్' సినిమాను కలిసి చూడటం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ఎన్ని చేసినా విడిపోవడం ఖాయమంటున్నారు ఈ జంట.
తాజాగా మరోసారి ధనుష్ - ఐశ్వర్యల విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఉదయం 10:30 గంటలకు ఐశ్వర్య కోర్టుకు వచ్చారు. ధనుష్ రావడం ఆలస్యం కావడంతో కేసు 12 గంటలకు వాయిదా పడింది. 11:30కి ధనుష్ కోర్టుకు చేరుకున్నారు. 12 గంటలకు ఇద్దరూ జడ్జి ముందు హాజరయ్యారు.ఇద్దరూ కలిసి బ్రతకడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని రద్దు చేయాలని జడ్జిని కోరారు. జడ్జి ఈ కేసు తీర్పును 27వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇక వీరు కలిసి ఉండే అవకాశం లేదని విడిపోతారని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.