జట్టు రాలకుండా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయని కరెక్ట్ ఫుడ్ తింటే బట్టతల రాకుండా ఆపవచ్చని తెలిపారు డాక్టర్లు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సగం మంది టీనేజ్ లోనే ఎదుర్కొంటున్న సమస్య . ఏపీ లోని గుంటూరు లో ఐఏడీవీఎల్ కుటికాన్ -2024 రెండు రోజుల సదస్సులో చాలా ఇంట్రస్టింగ్ గా విషయాలు తెలిపారు. అసలు జట్టు రాలకుండా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయని కరెక్ట్ ఫుడ్ తింటే బట్టతల రాకుండా ఆపవచ్చని తెలిపారు డాక్టర్లు.
ఏపీ గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన భారత చర్మ, సుఖ, కుష్ఠు నిపుణుల సంఘం (ఐఏడీవీఎల్) కుటికాన్-2024 రెండు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. ఈ వేదికపై బట్టతల సమస్యకు పూతమందు లేదా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. జుట్టు రకం, తీరుతెన్నులు, వంశపారంపర్య సమస్యలు విశ్లేషించి మాత్రలు ఎంత మోతాదులో వాడాలో నిర్ణయించాల్సి ఉందన్నారు. కాని మినిమమం ఫిష్ ఆయిల్ ..ఈ విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నా మంచి రిజల్ట్ వస్తుంది. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది.
జుట్టు రాలడం అనేది తల్లిదండ్రుల ఇరువైపుల నుంచీ వారసత్వంగా వస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అధ్యయనం వెల్లడిస్తోంది. తల్లితండ్రులు ఇద్దరికీ వంశపారపర్యంగా జుట్టు రాలిపోవడం ఎక్కువగా ఉంటే ..మీకు కూడా రాలుతుంది. మీరు తీసుకునే కేర్ లోనే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మరొకటి గుర్తుపెట్టుకొండి. మీ ముఖం , జుట్టు అందంగా ఉందంటే మీ ఆరోగ్యంగా ఉన్నట్లే. ఇది గుర్తుపెట్టుకొండి.