న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కాఫీ తాగడం చాలా మందికి అలవాటు . అయితే అధికమోతాదులో కాకుండా ఏదో చిన్న కప్ తో కాఫీ రోజు అలవాటు గా తాగితే అది మీ లైఫ్ ను మరో రెండేళ్లు ఎక్కువ బ్రతికిస్తుందని చాలా తక్కువ మందికే తెలుసు. కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన ఈ అధ్యయన వివరాలు ‘ఏజింగ్ రీసెర్చ్ రివ్యూస్ జర్నల్’లో వెల్లడించారు.
కాఫీ తాగడం వల్ల ఒకరి జీవితానికి అదనంగా ఆరోగ్యకరమైన మరో 1.8 సంవత్సరాలు కలుస్తాయని పోర్చుగల్ అధ్యయనకారులు తెలిపారు. కాఫీ అంటే మనం తాగేది కాదు..యూరప్ కంట్రీస్ లో బ్లాక్ కాఫీ తాగుతారు. అది కూడా కాఫీ డికాషన్ విత్ హనీ ...ఇలా తాగితే ఆయుష్షును పెంచుతుంది. కాని మనం తాగే కాఫీ పాలతో ఉంటుంది. దీని వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ జనాభా వేగంగా వృద్ధాప్యం చెందుతోందని అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాదు మనిషి ఎక్కువ రోజులు జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని కోయింబ్రా యూనివర్సిటీ ముఖ్య పరిశోధకుడు రోడ్రిగో చుంచా తెలిపారు.
గుండె జబ్బులు , దీర్ఘకాల వ్యాధులు వంటి వివిధ కారణాలతో మరణించే ముప్పును కాఫీ తగ్గిస్తుందని విస్తృతంగా జరిగిన పరిశోధనలో తేలినట్టు చెప్పారు. కాఫీ లో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు 2000 కు పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవి న్యూరో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి బ్లాక్ కాఫీ కారణంగా ఇన్సులిన్ కంట్రోల్ లో ఉంటుంది.