షేక్ మహ్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ‘మహ్రా ఎమ్1’ కింద త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు విడాకులు సెలబ్రెటీస్ చాలా కామన్ . చిన్న చిన్న సెలబ్రెటీసే విడాకులు చాలా కామన్ అయిపోయాయి. దుబాయ్ యువరాణి వేల కోట్లకు వారసురాలు తన విడాకులను ఎంత లైట్ తీసుకోవాలి. తన మాజీ భర్త పై పర్ఫెక్ట్ రివైంజ్ తీసుకుంది.పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆమె సొంతంగా ఓ బ్రాండ్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపారు. దానికి ఆమె పెట్టిన పేరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తాను ‘డైవోర్స్’ పేరిట ఒక కొత్త పెర్‌ఫ్యూమ్ ను రిలీజ్ చేసింది. షేక్ మహ్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ‘మహ్రా ఎమ్1’ కింద త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా అల్ మక్తమ్ విడాకుల ప్రకటన యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. పెళ్లైన ఏడాదికే విడిపోయారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే యువరాణి షేక్ మెహ్రా రూపంలో చాలా అధ్భుతంగా ఉంటుంది. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్.
యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె అయిన షేక్ మహ్రా.. బ్రిటన్‌లో చదువుకుంది. గతేడాది మే 27న దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనాబిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌ను వివాహం చేసుకున్నారు. తన భర్త కు వేరే వారితో సంబంధాలున్నాయనే విషయంపై మహ్రా విడాకులు ఇచ్చేసింది.‘ఐ డైవోర్స్ యూ’. టేక్ కేర్.. మీ మాజీ భార్య’’ అని పోస్ట్ పెట్టారు. ఫోన్లోనే తలాఖ్ చెప్పేసింది.