మా దగ్గర పూడురు అనే ఊరుకు రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే వెళ్లాను. రేవంత్ రెడ్డికి దండం పెట్టబోతే వద్దంటూ నవ్వుతూ తిరస్కరించాడు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా పదవి ఇస్తే చేస్తాను
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గంగవ్వ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లడమే కాదు ఆ క్రేజ్ తో ఇప్పుడు ప్రభుత్వం ఏ పదవి ఇచ్చినా చేస్తానంటూ క్రేజీ కామెంట్లు చేసింది గంగవ్వ.ప్రస్తుతం టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగవ్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మా దగ్గర పూడురు అనే ఊరుకు రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే వెళ్లాను. రేవంత్ రెడ్డికి దండం పెట్టబోతే వద్దంటూ నవ్వుతూ తిరస్కరించాడు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా పదవి ఇస్తే చేస్తాను. అది ఏ పదవి అయినా ఏ పనైనా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. నాకు కూడా ఆలోచన ఉందంటూ చెప్పుకొచ్చింది. కేటీఆర్ కూడా ఏం చెప్పినా చేస్తా. నాకు అందరూ ఒకటే అని తెలిపింది. దీంతో గంగవ్వ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాకు సీఎం రేవంత్ రెడ్డి , కేసీఆర్ ఇద్దరు ఒక్కటే అని అన్నారు. అయితే గంగవ్వ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు కూడా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. ఆమెకు ఉన్న క్రేజ్ చూసి ఏదైనా పదవి ఇచ్చే అవకాశముందంటున్నారు.