off beat: రూ.500 కే గోవా వెళ్లొచ్చంటే నమ్ముతారా ...ఫుల్ డీటైల్స్ ఇదిగో !


సికింద్రా బాద్ టూ మడ్గావ్ : సికింద్రాబాద్ నుంచి గోవాలోని మడ్గావ్ నగరానికి 17039 SC VSG EXPRESS నడుస్తోంది. ఇది మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.


Published May 31, 2025 01:18:00 PM
postImages/2025-05-31/1748677817_720x480.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గోవా ..దేశం అన్ని మూలల నుంచి ఎవరినైనా అడుగండి గోవా అనగానే భలే థ్రిల్లింగ్ గానే ఫీలవుతారు. మీ డ్రీమ్ డెస్టినేషన్ గోవా అయితే తక్కువ ఖర్చులో ఎలా వెళ్లిరావాలో చెప్పేస్తాం సేవ్ చేసుకోండి.ఫస్ట్ సికింద్రాబాద్ చేరుకొండి. 


సికింద్రా బాద్ టూ మడ్గావ్ : సికింద్రాబాద్ నుంచి గోవాలోని మడ్గావ్ నగరానికి 17039 SC VSG EXPRESS నడుస్తోంది. ఇది మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. సుమారు 19 గంటల ప్రయాణం తర్వాత గోవాలో అడుగు పెడతారు. అయితే ట్రిప్ ఎప్పుడు  మీ ఖర్చు మీదే ఆధారపడుతుంది. కాబట్టి తక్కువ ఖర్చులో గోవా చేరుకుంటే ఆ తర్వాత ఖర్చులు మీ ఇష్టం ..మీ సరదా కొద్ది ఖర్చు .
ఇందులో మొత్తం నాలుగు రకాల సీట్లు అందుబాటులో ఉన్నాయి.


1A : ఇది ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్. దీని ధర రూ.2,795గా ఉంది


2A : ఇది సెకండ్ క్లాస్ ఏసీ కోచ్. ఇందులో టికెట్ ధర రూ.1665


3A : ఈ క్లాస్​లో టికెట్ ధర రూ.1160గా ఉంది.


3E : ఈ టికెట్ రేటు రూ.1075గా నిర్ణయించారు.


SL : ఇది స్లీపర్ కోచ్. ఇందులో టికెట్ ధర రూ.430


మీకు నచ్చిన కేటగిరిలో రిజర్వేషన్ చేయించుకొండి. స్లీపర్ లో అయితే బడ్జెట్ లో వెళ్లిపోతారు. ఇక అక్కడ నుంచి మీ ఖర్చులు మీ ఇష్టం. బడ్జెట్ లో అయితే గోవా చేరుకున్నారు సుమా.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu goa goatourism

Related Articles