బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఇప్పటికి నాలుగు వారాలు సెప్టెంబర్ 29న పూర్తవుతాయి. ఇప్పటికే మూడు వారాల్లో మొదటివారం బేబక్క రెండో వారం శేఖర్ భాష, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఇక
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఇప్పటికి నాలుగు వారాలు సెప్టెంబర్ 29న పూర్తవుతాయి. ఇప్పటికే మూడు వారాల్లో మొదటివారం బేబక్క రెండో వారం శేఖర్ భాష, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఇక నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఇదే తరుణంలో మొదటి రెండు వారాలు ఎంతో సైలెంట్ గా ఉంటూ వచ్చినటువంటి నబీల్ మూడో వారం నుంచి తన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు.
నబీలు సైలెంట్ గా ఉంటాడు అనుకుంటే మూడో వారం నుంచి ఆయనే టాప్ ప్లేస్ ఓటింగ్ లో ఉన్నారు. అంతేకాదు నబిల్ టైటిల్ విన్నర్ రేసులో కూడా ఉంటారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి బిగ్బాస్ హౌస్ లో ఉన్న విషయాల గురించి పక్కన పెడితే స్వంత లైఫ్ లో యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.
అయితే యూట్యూబ్ ఛానల్ లో తనతో నటించే ఒక అమ్మాయితో ఆయన ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నారట. అంతేకాదు ఆమె బర్త్డే రోజు తన లవ్ విషయాన్ని ఆమెతో చెప్పి ఇంప్రెస్ చేశారట. ఆమె కూడా తన లవ్ ని యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందినదిగా తెలుస్తోంది. అయితే నబిల్ బిగ్ బాస్ హౌస్ లో కప్పు కొట్టి వచ్చి వివాహం చేసుకుంటానని ఆమెకు మాటిచ్చారట.
ఆ మాట ప్రకారమే నబీన్ హౌస్ లో కూడా ఇతర అమ్మాయిలకు దూరంగా ఉంటూ తన గేమ్ పై దృష్టి పెట్టి అద్భుతంగా ఆడుతూ దూసుకుపోతున్నారు. ఇదే తరుణంలో నబీల్ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.