naga sadu నాగసాధువులకు ఆ శక్తి ఎలా లభిస్తుంది !

ఇండియన్స్ కి కూడా డౌటే. ప్రతి విషయంలో కఠోరమైన సాధన అనే కథనంలో  తెలుసుకుందాం.


Published Jan 17, 2025 07:46:00 PM
postImages/2025-01-17/1737123492_mahakumbhnagasadhusnan1736843937948.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: భారత్ లో ఆధ్యాత్మికంగా నాగసాధువులు , అఘోరాలు ఎప్పుడు చాలా ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. ఈ నాగసాధువులు వస్త్రాలు ధరించరు. ప్రయాగ్ రాజ్ గడ్డ కట్టే చలిలో కూడా వారు ఎలా ఉండగలుగుతున్నారనేది ఫారనర్స్ కే కాదు..ఇండియన్స్ కి కూడా డౌటే. ప్రతి విషయంలో కఠోరమైన సాధన అనే కథనంలో  తెలుసుకుందాం.


ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13వ తేదీ, పుష్యపౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమైంది. 144 ఏళ్లకు ఓ సారి మాత్రమే జరిగే మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. గంగా , యమునా , సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు , నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 


త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు తొలిరోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగ సాధువులు, అఘోరాలు, సన్యాసులు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. చలిని ఎలా భరించగలుగుతున్నారు. ఒక నాగ సాధువు అనేక సంవత్సరాలుగా 1.25 లక్షల రుద్రాక్షలను ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకమైన పధ్ధతిలో తమ భక్తిని చూపిస్తుంటారు.


సరైన దుస్తులు లేకుండా మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 2.5 గంటలు మాత్రమే జీవించగలరు. కాని నాగసాధువులు రెండు పొరల దుస్తులతో వారు 15 గంటలు జీవించగలరు. ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలుగుతున్నారు. ఈ 3 రకాల సాధనలను చేస్తారు.


అగ్ని సాధన :
నాగ సాధువులు ఈ సాధన వల్లే అంత చలిలో ఉండగలుగులున్నారు. ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది.


నాడీ శోధన :
ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రతను అన్ని కాలాల్లో క్రమబద్ధంగా, వెచ్చగా ఉండేలా చూస్తుంది. ఇది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి శరీరంలో ఉన్న ప్రతి నాడీ యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ సాధన చెయ్యడం కష్టం. దీంతో పాటు ఈ స్టేజ్ వరకు రావడానికి దాదాపు ఎన్నో యేళ్లు పడుతుంది.


* మంత్ర పఠనం :నాగ సాధువులు నిరంతరం మంత్రాలను పఠించడం ద్వారా వారి శరీరంలో దివ్యమైన పాజిటివ్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది.


విభూతి యోగం : నాగ సాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే విభూతిలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి. అంటే విభూతి ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu prayagraj mahakumbamela

Related Articles