WEDDING: 25 ఏళ్ల లోపు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే రూ.81 వేల ప్రోత్సాహకం !

న్యూస్ లైన్  , స్పెషల్ డెస్క్: జననాల  రేటు దేశంలో గణనీయంగా పడిపోతున్నాయి. అసలు పిల్లలు తక్కువ...వృధ్ధులు ఎక్కువగా ఉంటున్నారు. ఒక్క దేశం కాదు అన్ని దేశాల బాధ అదే. అందుకే రష్యా కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సహాకాలు ఏర్పాటు చేసింది. ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చే 25 ఏళ్లలోపు విద్యార్థినులకు లక్ష రూబుళ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 81 వేలు) ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.  అంతేకాదు లోకల యూనివర్సిటీ , కాలేజీల్లో ఫుల టైం చదువుతున్న 25 ఏళ్ల యువతులే ఈ పథకానికి అర్హులు . కాని వారు కంపల్సరీ రష్యా పౌరసత్వం కలిగి ఉండాలి.
ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చిన వారికే ఈ నగదు బహుమతి లభిస్తుంది. చనిపోయిన బిడ్డకు జన్మనిస్తే ఇది వర్తించదు. బిడ్డకు వైకల్యం ఉన్నా ఇది వర్తించదు. అయితే మరిన్ని విషయాలపై రష్యా ప్రభుత్వం స్పష్టతకు రావాల్సి ఉంది. 
2024లో రష్యాలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. ప్రతి ఏడాదితో పోలిస్తే 16 వేల మంది తక్కువగా జన్మించారు. గత 25 ఏళ్లతో పోలిస్తే జననాల రేటు ఇదే అత్యల్పం.ప్రతి యేడాదికి 16 వేల మంది చిన్నారులు తగ్గిపోతున్నారు. దీని వల్ల దేశ భవిష్యత్తు కి ప

Published Jan 09, 2025 05:50:00 PM
postImages/2025-01-09/1736425360_russiamoscowcoupletakingaselfieandsmilingWPEF00422.jpg

న్యూస్ లైన్  , స్పెషల్ డెస్క్: జననాల  రేటు దేశంలో గణనీయంగా పడిపోతున్నాయి. అసలు పిల్లలు తక్కువ...వృధ్ధులు ఎక్కువగా ఉంటున్నారు. ఒక్క దేశం కాదు అన్ని దేశాల బాధ అదే. అందుకే రష్యా కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సహాకాలు ఏర్పాటు చేసింది. ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చే 25 ఏళ్లలోపు విద్యార్థినులకు లక్ష రూబుళ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 81 వేలు) ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.  అంతేకాదు లోకల యూనివర్సిటీ , కాలేజీల్లో ఫుల టైం చదువుతున్న 25 ఏళ్ల యువతులే ఈ పథకానికి అర్హులు . కాని వారు కంపల్సరీ రష్యా పౌరసత్వం కలిగి ఉండాలి.

ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చిన వారికే ఈ నగదు బహుమతి లభిస్తుంది. చనిపోయిన బిడ్డకు జన్మనిస్తే ఇది వర్తించదు. బిడ్డకు వైకల్యం ఉన్నా ఇది వర్తించదు. అయితే మరిన్ని విషయాలపై రష్యా ప్రభుత్వం స్పష్టతకు రావాల్సి ఉంది. 

2024లో రష్యాలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. ప్రతి ఏడాదితో పోలిస్తే 16 వేల మంది తక్కువగా జన్మించారు. గత 25 ఏళ్లతో పోలిస్తే జననాల రేటు ఇదే అత్యల్పం.ప్రతి యేడాదికి 16 వేల మంది చిన్నారులు తగ్గిపోతున్నారు. దీని వల్ల దేశ భవిష్యత్తు కి పెను విపత్తు జరిగే అవకాశముందని ఈ నిర్ణయం తీసుకున్నారట.
 
newsline-whatsapp-channel
Tags : newslinetelugu students wedding pregnant russia

Related Articles