మిషన్స్ వచ్చాక మనిషి తెలివి హైబ్రీడ్ అయిపోయింది. పట్టుమని పది నెంబర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. కాని జంతువులు వాటి తెలివిని అవి బాగానే కాపాడుకుంటున్నాయి
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు మనిషిని తెలివైన వాడని ఎందుకు అంటారు . ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది. విచక్షణా శక్తిని ఎక్కువగా ఉంటుంది. కాని మనిషి తర్వాత అంత ఆలోచనా శక్తి ఉండే కొన్ని జంతువులు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మిషన్స్ వచ్చాక మనిషి తెలివి హైబ్రీడ్ అయిపోయింది. పట్టుమని పది నెంబర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. కాని జంతువులు వాటి తెలివిని అవి బాగానే కాపాడుకుంటున్నాయి.
*డాల్ఫిన్స్:
సముద్ర జీవులైన డాల్ఫిన్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. డాల్ఫిన్స్ కు విజిల్స్ ద్వారా వెల్లడించాడు . డాల్ఫిన్లు విజిల్స్ ద్వారా మాట్లాడుకుంటాయి. ఇవి ఏదైనా చూస్తే చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటాయి. మనిషి తెలివికి డాల్ఫిన్స్ తెలివి ఈక్వల్ గా లేదంటే ...ఓ పది శాతం ఎక్కువే.
* చింపాంజీలు:
గత కొన్ని రోజులుగా భూమి మీద చింపాంజీలు తగ్గిపోతూ వస్తున్నాయి. అసలు కోతులు , చింపాంజీల నుంచే మనిషి వచ్చాడని అంటుూ ఉంటారు. అయితే సేమ్ ఇది మనిషిలానే ఆలోచిస్తుంది. మనిషి లాగే తన ఆలోచనలు ..ఎమోషన్స్ అన్ని ఉంటాయి.అంతే కాదు మనలానే సమస్యలను ముందుగా ఆలోచించగలదు .
* ఒరంగుటాన్:
ఈ రకం కోతులు చాలా తెలివైనవి. ఇవి అడవుల్లో ఆయుధాలను ఉపయోగించే సామర్థ్యం కలవి. తమను కాపాడుకోవడానికి...అవి చక్కగా ఆయుధాలు పట్టుకొని అడివిలో తిరుగుతున్నాయి.
* ఏనుగు:
ఏనుగులు అనగానే భారీ శరీరం గుర్తొస్తుంది. ఏనుగులకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఏనుగులు మూత్రం వాసన ద్వారా వాటి బంధు ఏనుగులను గుర్తుపడతాయి. ఇలా ఒకటి రెండు కాదు..ముప్పై ఏనుగులను విరివిరిగా గుర్తుపట్టగలవు.
* కాకి:
కాకులు ఎమోషనల్ గా ఉంటాయి. వీటికి భావావేశాలు ఎక్కువ. కాకులకు ముఖాలను గుర్తుపెట్టుకొని తమకు భోజనం పెడుతున్నవారిని ...వాటితో పాటు తిరిగే కాకులను చక్కగా గుర్తుంచుకుంటాయి. అంతే కాదు సాధ్యం కాని పనిని కూడా చక్కగా ఆలోచించి షార్ట్ కట్ లో ఆ పనిని చేసుకుంటాయి.