ఆడవారు భర్త తోడు లేకుండా ...పిల్లల బాధ్యతను చూసుకోవడం చాలా కష్టం దీని వల్ల తనకు భర్త తోడు అవసరమని పెద్దలు అలా ఆలోచించి చేసిన ఆచారమే ఈ ఆచారం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పెళ్లి తర్వాత భర్త చనిపోతే ..ఆ స్త్రీకి జీవితం అయిపోతుందంటారు. అసలు భర్త చనిపోతే ..ఆడవారి జీవితంలో ఉన్న రంగులు ..కలలు అన్ని చెదిరిపోయినట్లే. కాని మధ్యప్రదేశ్ లో మాత్రం ఆడవారికి భర్త చనిపోతే ఆడవారికి వెంటనే 10 వ రోజునే మళ్లీ పెళ్లిచేస్తారు. ఎందుకంటే వారి పెద్దలు చెప్పిన దాని ప్రకారం .. ఆడవారు భర్త తోడు లేకుండా ...పిల్లల బాధ్యతను చూసుకోవడం చాలా కష్టం దీని వల్ల తనకు భర్త తోడు అవసరమని పెద్దలు అలా ఆలోచించి చేసిన ఆచారమే ఈ ఆచారం.
మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఇలాంటి సంప్రదాయం ఉంది. ఇక్కడి గిరిజన మహిళలు తమ భర్తలు మరణించిన తర్వాత కూడా వితంతువుగా ఉండరు. సంప్రదాయం ప్రకారం, ఇక్కడి మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తితో తిరిగి వివాహం చేసుకుంటారు. ఆ పురుషుడు భర్త సోదరుడు కావచ్చు. వారి కుటుంబంలోని ఎవరైనా కావచ్చు.
అయితే ఆ మహిళ పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు అందుబాటులో లేకపోతే ..లేదా ఆవిడకి ఎవ్వరిని పెళ్లి చేసుకునే ఇష్టం లేకపోతే స్త్రీకి ఇక్కడ ప్రత్యేక వెండి కంకణం ధరిస్తారు. ఈ గాజు ధరించిన తర్వాత, ఆమెను వివాహిత మహిళగా పరిగణిస్తారు. ఈ గాజులను పోటా అంటారు. ఈ సాంప్రదాయాన్ని మధ్యప్రదేశ్ లోని మాండ్లా జిల్లాలో జరుపుకుంటారు. బోడ్ తెగ నాటికి ఈ సంప్రదాయం పాటిస్తుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో మహిళలు ఎప్పుడు సుమంగళిలే ...ముత్తైదువుగానే చనిపోతారు.