ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇద్దరి మధ్య సరైన ప్రేమ లేకపోవడం ఒకరి లక్షణాలు మరొకరికి
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇద్దరి మధ్య సరైన ప్రేమ లేకపోవడం ఒకరి లక్షణాలు మరొకరికి నచ్చకపోవడం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలామంది పురుషుల్లోని కొన్ని లక్షణాలు మహిళలకు నచ్చకపోవడం వల్లే వారి బంధం విచ్ఛిన్నం అవుతోంది.. మరి ముఖ్యంగా పురుషుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటే స్త్రీ చచ్చిన వదిలిపెట్టకుండా వారితోనే ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అర్థం చేసుకోవడం:
కొంతమంది పురుషులు ఆడవాళ్లు అంటే ఏదో ఆట వస్తువులా చూస్తూ ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత సొంత భార్యను ఒక వంటింటి మనిషిలా, తన కోరికలు తీర్చే మిషన్ లా భావిస్తారు. కనీసం వారి యొక్క ఆలోచనకు అభిప్రాయాలకు వ్యాల్యూ ఇవ్వరు. ఇలాంటి పురుషులను మహిళలు సచ్చిన ఇష్టపడరట. ముఖ్యంగా స్త్రీ ఆలోచనలను అర్థం చేసుకొని వారికి ఏం కావాలో చెప్పకుండానే అర్థం చేసుకునే వారిని, స్త్రీ చేసే పనులకు కూడా గౌరవం ఇచ్చే వారిని వారు అమితంగా ప్రేమిస్తారట.
ఓపెన్ గా మాట్లాడడం:
కొంతమంది పురుషులు భార్యతో ఓపెన్ గా అసలు మాట్లాడరు.. ఏదైనా విషయం ఉంటే నీకెందుకు అవసరమా అని మాట్లాడతారు. అలా కాకుండా తన సొంత భార్యతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకొని అన్ని ఓపెన్ గా చెప్పాలి. సతీమణి అంటే తనలో సగభాగం కాబట్టి తనకు సంబంధించిన బాధలు, సంతోషాలు ఆర్థికపరమైన విషయాలు కూడా తన సతీమణితో చర్చిస్తే ఆమె సంతోషిస్తుందట. దీనివల్ల ఆమె పరాయి మగాడి వైపు కూడా చూడటానికి అస్సలు ఇష్టపడరు.
మద్యం :
కొంతమంది పురుషులు తరచూ మద్యం, ధూమపానం సేవిస్తూ స్త్రీలను ఇబ్బంది పెడతారు. ప్రతిరోజు కంపరం కొట్టే శరీరంతో వారి దగ్గరికి వెళ్తే స్త్రీలు అసలు ఇష్టపడరట. కాబట్టి వీటన్నింటికీ దూరంగా ఉండి, ప్రతిరోజు ఆకర్షణీయంగా కనిపిస్తే స్త్రీలు చచ్చేంత లవ్ చేస్తారట.
లైంగిక ఆలోచన :
ముఖ్యంగా ప్రతిరోజు స్త్రీలతో మీ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకోవడమే కాకుండా, లైంగిక పరంగా కూడా ఎంజాయ్ చేయాలట. దీని వల్ల కూడా స్త్రీలు మిమ్మల్ని వదులుకోవడానికి అసలు ఇష్టపడరు..
ఫ్యామిలీతో గడపడం:
కొంతమంది పురుషులు ఫ్యామిలీతో గడపకుండా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కాస్త స్పెండ్ చేయడం, అలాగే ఏదైనా లొకేషన్స్, కొత్త కొత్త ప్లేస్ లకు వారికి చూపించడం వల్ల మీ మధ్య బలం అద్భుతంగా బలపడుతుందని నిపుణులు అంటున్నారు.
కించపరచడం:
కొంతమంది పురుషులు పెళ్లయిన ఆడవారిని అత్తమామలు ఇతర బంధువుల ముందు కించపరుస్తారు. ఆడదానివి అనిగిమనిగి ఉండు అంటూ మాట్లాడతారు. అలా కాకుండా చేసుకున్న భార్యను పదిమందిలో కూడా గౌరవం ఇచ్చి మాట్లాడితే ఆమె మిమ్మల్ని కాకుండా మీ కుటుంబాన్ని కూడా అమితంగా ప్రేమించి గౌరవంతో బ్రతుకుతుందని నిపుణులు అంటున్నారు.