10 గ్రాముల ధర రూ. 95,620 గా ఉంది. 18 క్యారట్ల బంగారం మీద 130 పెరిగి..10 గ్రాముల బంగారం రూ.71,720గా ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ మధ్య కాలంలో బంగారం ధర పెరగడమే కాని తగ్గడం జనాలు అసలు ఊహించడం లేదు. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోను బంగారం ధర 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 150 పెరిగింది. రూ. 87,650 గా ఉంది. ఇక హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నం లో 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 160 పెరిగింది. ఇప్పుడు 10 గ్రాముల ధర రూ. 95,620 గా ఉంది. 18 క్యారట్ల బంగారం మీద 130 పెరిగి..10 గ్రాముల బంగారం రూ.71,720గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగి రూ.87,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.95,770గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరిగి 71,840గా ఉంది.
భారత్‌లో వెండి ధరల్లో ఇవాళ ఉదయం రూ.100 తగ్గుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో వెండి ధర రూ. 97,900 గా ఉంది. విశాఖ లో వెండి ధర రూ.1,09,000గా ఉంది.