JOBS: సైనిక్ స్కూల్ లో జాబ్స్.. నెలకు 52 వేల జీతం..అర్హతలివే !


Published Aug 27, 2024 06:36:00 PM
postImages/2024-08-27/1724764108_sainikschool1719307252.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రభత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఇది మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. సైనిక్ స్కూల్ లో ఉద్యోగాల పడ్డాయి. కోరకొండలో చాలా ఉద్యోగాలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. మంచి జీతంతో పాటు లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం కూడా పొందవచ్చు.


ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కౌన్సిలర్, క్రాఫ్ట్& వర్క్ షాప్ ఇన్ స్ట్రక్టర్, గుర్రపు స్వారీ శిక్షకుడు, బ్యండ్ మాస్టర్, టీజీటీ మ్యాథమేటిక్స్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సిస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సైకాలజీ, డీపీఎడ్, బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. మరిన్ని వివరాలు చూద్దాం.
పోస్టుల వివరాలు:


కౌన్సిలర్: 01


అర్హత: సైకాలజీలో పట్టభద్రులు / పోస్ట్ గ్రాడ్యుయేట్లు అర్హులు.


వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు


జీతం: రూ.52,533


పి.టి.ఐ – కమ్ మాట్రన్ ( మహిళలు): 01


అర్హత: ఫిజిలేదా డి.పి.ఎడ్.
వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు
జీతం: రూ.34,000
క్రాఫ్ట్ & వర్క్‌షాప్ ఇన్‌స్ట్రక్టర్: 01
అర్హత:
మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానం.
రెండు సంవత్సరాల ట్రేడ్ సర్టిఫికేట్.
ఆంగ్ల మాధ్యమంలో బోధించే సామర్థ్యం.


వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు


జీతం: రూ.34,164


గుర్రపు స్వారీ శిక్షకుడు: 01


అర్హత:
ఇంటర్మీడియట్.


స్కూల్ / గుర్రపు స్వారీ క్లబ్‌లో గుర్రపు స్వారీ శిక్షకుడిగా అనుభవం.


వయోపరిమితి: 21- 50 సంవత్సరాలు


జీతం: రూ.34,000


బ్యాండ్ మాస్టర్: 01


అర్హత:
ఏఈసీ శిక్షణ కళాశాల మరియు కేంద్ర పచ్మహార్చిలో బ్యాండ్ మాస్టర్/బ్యాండ్ మేజర్/డ్రమ్ మేజర్‌గా పనిచేసే అర్హత లేదా
నావిక్/ఎయిర్ ఫోర్స్‌కు సమానమైన కోర్సులు.


వయోపరిమితి: 21- 50 సంవత్సరాలు
జీతం: రూ.34,000


టి.జి.టి మ్యాథమేటిక్స్: 01


అర్హత:
గణితం ఒక సబ్జెక్టుగా కనీసం 50% మార్కులు మరియు మొత్తంలో 50% మార్కులు సాధించి పట్టభద్రులు.
సంబంధిత సబ్జెక్టులో బి.ఎడ్.


ఎన్ సీటీఈ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్

పేపర్-2లో ఉత్తీర్ణత.


వయోపరిమితి: 21- 35 సంవత్సరాలు


జీతం: రూ.52,533


మెడికల్ ఆఫీసర్: 01


అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ.


వయోపరిమితి: 21- 50 సంవత్సరాలు


జీతం: రూ.74,552


నర్సింగ్ సిస్టర్ (స్త్రీ): 01


నర్సింగ్ డిగ్రీ ఉండాలి ..లేదా దానికి సమానమైన డిగ్రీతో ఫస్ట్ క్లాస్ తో పాసవ్వాలి. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ..సెప్టెంబర్ 13 ఆఖరి తేదీ. మరిన్ని వివరాల కోసం అఫిషియల్ సైట్ చెక్ చెయ్యండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu doctors sainik-school jobs teacher

Related Articles