Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి షురూ !

తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు పెళ్లి కూతురు రహస్య. 


Published Aug 21, 2024 12:44:00 PM
postImages/2024-08-21/1724224588_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం , రహస్య పెళ్లి పనులు మొదలయిపోయాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో సక్సస్ అయిన హీరో కిరణ్ చాలా డిఫరెంట్ టాపిక్స్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ముందుగా షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన కిరణ్‌ అబ్బవరం.. ఆ తర్వాత రాజా వారు రాణి వారు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్‌. తర్వాత SR కళ్యాణమండపం సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు.


కర్ణాటకలోని కూర్గ్‌లో కిరణ్, రహస్యల వివాహం జరగనుందని సమాచారం. వివాహానికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో వధూవరులిద్దరూ బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు పెళ్లి కూతురు రహస్య. 


కిరణ్ లిస్ట్ లో సెబాస్టియన్‌, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యం విష్ణుకథ, మీటర్‌, రూల్స్‌ రంజన్‌ ఇలా అరడజనుకు పైగా సినిమాలు చేశాడు. ప్రస్తుతానికి పీరియాడికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్నారు. సినిమా ఇంకా షూటింగ్ లో ఉంది. ఈ పెళ్లి పిక్స్ లో రహస్య, కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige kiran-abbavaram rahasya-gorakh

Related Articles