Megha Akash: పెళ్లి పీటలెక్కిన మేఘూ ఆకాశ్ ..హాజరవుతున్న సినీ పెద్దలు

విష్ణుతో పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. రిసెప్షన్ పిక్స్ ను పోస్ట్ చేసింది. 


Published Sep 15, 2024 03:09:00 PM
postImages/2024-09-15/1726393353_74861f7c12f1809019cef436f8b7fc361714139183835932original.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మేఘూ ఆకాశ్ కొత్త జీవితం మొదలుపెట్టబోతుంది. బ్యాచులర్ లైఫ్ కు బై బై చెప్పి మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చెయ్యబోతుంది. విష్ణుతో పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. రిసెప్షన్ పిక్స్ ను పోస్ట్ చేసింది. 


చెన్నైలో జరిగిన మేఘా ఆకాశ్ పెళ్లి వేడుకలో చాలా మంది సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కొత్త దంపతులను మనసారా ఆశీర్వదించారు. వెడ్డింగ్ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎన్నో యేళ్ల నుంచి ప్రేమ ఉన్నా సీక్రెట్ గా దాచింది. రీసెంట్ గా పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకుంది.


సూపర్ స్టార్ రజినీకాంత్ తదితర సినీ ప్రముఖులకు తనే స్వయంగా వెడ్డింగ్ కార్డ్స్ ను అందజేసింది. రీసెంట్ గా శ్రీలంకలో తన ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకుంది.  అమ్మడు తమిళ్ మూవీస్ కాకుండా తెలుగులో చాలా మందితో చేసింది. లై , ఛల్ మోహన్ రంగ, రాజరాజచోర, గుర్తుందా శీతాకాలం , ప్రేమదేశం రావణాసుర , బూ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Megha Akash (@meghaakash)

newsline-whatsapp-channel
Tags : wedding love-story social-media chennai megha-akash

Related Articles