viral: 20 లక్షల విలువైన బ్యాగ్ ను ఎత్తుకెళ్లిన కోతి !

అలీగఢ్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి బృందావనానికి వెళ్లాడు. అక్కడున్న పలు ఆలయాలను వారు దర్శించారు.


Published Jun 09, 2025 05:45:00 PM
postImages/2025-06-09/1749471430_monkeysnatchbagcontaininggoldworth20lakhs17494442308671200x675xt.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కోతి మూక అని ఊరికే అంటారా ...తెలిసీ తెలియక చేసిన పిచ్చిపనులు కొందరికి భారీ నష్టాన్ని కలుగచేస్తాయి, అయితే సుమారు రూ. 20 లక్షల విలువైన నగల బ్యాగ్ ను ఓ వ్యక్తి నుంచి కోతి లాక్కెళ్లిపోయింది. తిరిగి తీసుకొద్దామని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వ్యక్తి పోలీసుల సాయాన్ని కోరాడు.ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ సంఘటన జరిగింది. జూన్‌ 6న అలీగఢ్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి బృందావనానికి వెళ్లాడు. అక్కడున్న పలు ఆలయాలను వారు దర్శించారు.


కాగా, ఇంటికి తిరిగి వెళ్లేందుకు అభిషేక్ అగర్వాల్ తన కారు వద్దకు నడిచి వెళ్తుండగా ఒక కోతి అతడి చేతిలోని బ్యాగ్‌ను లాక్కెళ్లింది. ఆ బ్యాగ్ లో చాలా విలువైన జ్యూయలరీ ఉండడంతో అభిషేక్ అతని ఫ్యామిలీ చాలా అందోళన చెంది ఆ కోతికి పండ్లు , ఆహారం ఇవ్వడం చాలా ప్రయత్నాలు చేశారు. కాని  ఏం ఫలితం లేదు.


మరోవైపు పోలీసులు ఆ కోతిని గుర్తించి దానిని చుట్టుముట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి చివరకు దాని నుంచి బ్యాగ్‌ను తీసుకున్నారు. ఆ బ్యాగ్ ను ఓనర్ కు అప్పగించారు. మతపరమైన ఆ పర్యాటక ప్రాంతంలో కోతుల ముప్పును నియంత్రించడానికి అధికారులు పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-video

Related Articles