nagchaitanya: తన నెక్స్ట్ వెబ్ సీరిస్ పై రియాక్ట్ అయిన నాగచైతన్య టీం !

నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంతకం కూడా చేశారని కూడా వార్తలు వచ్చాయి. దీని పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు , దీని పై నాగచైతన్య టీమ్ స్పందిస్తూ ..ఆ వార్తలను ఖండించింది.


Published Oct 15, 2024 05:45:00 PM
postImages/2024-10-15/1728994691_34405357134482333821144177024539099903293418n16831904364401683190452238.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అక్కినేని నాగచైతన్య మరో వెబ్ సీరిస్ రానుందని సోషల్ మీడియాలో ఫుల్ గా గాసిప్స్ రన్ అవుతున్నాయి. అంతేకాదు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంతకం కూడా చేశారని కూడా వార్తలు వచ్చాయి. దీని పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు , దీని పై నాగచైతన్య టీమ్ స్పందిస్తూ ..ఆ వార్తలను ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశాడు.
నాగ చైతన్య 'తండేల్' మూవీపైనే దృష్టి పెట్టారని టీమ్ తెలిపింది. నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌ సిరీస్ 'దూత' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరో సీరిస్ కు నాగచైతన్య  సంతకాలు చేశారని షూటింగ్ స్టార్ట్ అయ్యిందని ఏవేవో బోలెడు గాసిప్స్ వచ్చాయి. వాటిని కాదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు నాగచైతన్య కాన్సంట్రేషన్ అంతా తండేల్ పైనే ఉందని తెలిపారు. 


శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' మూవీ తెరకెక్కిస్తున్నారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథతో రూపొందుతున్న ఈ మూవీలో రాజు అనే మత్స్యకారుడుగా నాగ చైతన్య నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తోంది.  ఈ సినిమా పై నాగచైతన్య కు చాలా హోప్స్ ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో ..ఫేమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

newsline-whatsapp-channel
Tags : webseries nagachaitanya- thandel saipallavi dootha

Related Articles