Nani:నాని లైఫ్ హ్యాపీగా ఉండడానికి కారణం ఆవిడేనట.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో కెల్లా  హీరో నాని ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. డిఫరెంట్ క్యారెక్టర్లు చేసే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది


Published Aug 14, 2024 02:57:00 PM
postImages/2024-08-14/1723624595_nani12.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో కెల్లా  హీరో నాని ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. డిఫరెంట్ క్యారెక్టర్లు చేసే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది నాని పేరు మాత్రమే.  అలాంటి నాని ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనే సంబంధం లేకుండా  దూసుకుపోతున్నారు. అయితే నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే మూవీలో  నటిస్తూ నటిస్తూ వస్తున్నారు.

 అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక షోలో పాల్గొన్న నాని తన వివాహ జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. అయితే ఈ షోలో హోస్ట్ గా చేసిన సింగర్ శ్రీరామచంద్ర  ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రశ్నించారు.  దీనిపై స్పందించిన నాని నటన అనేది ఒక సుడిగాలి లాంటిది.  కానీ నా పక్కన నా భార్య అంజన ఎంతో బలంగా నిలబడింది. నేను గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆమె నాకు ప్రశాంతత అందించింది.

ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఈ చిత్రంలోని "అనుకుందే జరిగిందా" అనే పాటకు  నాని సింగర్ కార్తీక్ తో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ పాట నాకు ఎంతో ఇష్టమని, స్టేజ్ పై పాటలు లాంచ్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం నాని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line nani wife happy-life anjana dussera

Related Articles