జానీ మాస్టర్ కు చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. అసలు దెబ్బ మీద దెబ్బ నడుస్తూనే ఉంది. తన అసిస్టెంట్ ను అవకాశాల కోసం వాడుకున్నాడనే కేసుపై జానీ మాస్టర్ ఇప్పుడు పోలీస్ కస్టడీ లో ఉన్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : జానీ మాస్టర్ కు చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. అసలు దెబ్బ మీద దెబ్బ నడుస్తూనే ఉంది. తన అసిస్టెంట్ ను అవకాశాల కోసం వాడుకున్నాడనే కేసుపై జానీ మాస్టర్ ఇప్పుడు పోలీస్ కస్టడీ లో ఉన్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందికోర్టు. కాని నేషనల్ అవార్డు తాత్కాళికంగా క్యాన్సిల్ చేసింది కేంద్రప్రభుత్వం. అయితే తాత్కాళిక బెయిల్ పై విడుదలైన జానీకి ఊహించని షాక్ తగిలింది. నేషనల్ కొరియోగ్రాఫర్ అవార్డును తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. జానీ మాస్టర్ కు బెయిల్ కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.
ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఇలా చెయ్యడం పై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. జానీ మాస్టర్ ఎలాంటి వాడైనా తన టాలెంట్ కి వచ్చే గుర్తింపుని ఎలా క్యాన్సిల్ చేస్తారంటు ప్రశ్నిస్తున్నారు.
జాతీయ అవార్డును రద్దు చేయడంపై పలువరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదకగా స్పందిస్తున్నారు. అవార్డు క్యాన్సిల్ చేయడం సరికాదని పోస్టులు పెడుతూ జానీకి మద్దుతుగా నిలుస్తున్నారు. మరి జానీ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు.