LEHANGA: పెళ్లిలో రాధిక లెహంగా ఎందుకంత స్పెషల్ ?

అనంత్, రాధిక పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.  రాధిక లెహంగా అధ్భుతంగా ఉంది . దీనిని డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.  ఈ లెహంగాలో రాధిక హీరోయిన్స్ అందరిని పక్కకు నెట్టేసింది. చాలా అందంగా ఉంది. పెళ్లి కూతురు మహారాణిలా కనిపించింది.  


Published Jul 13, 2024 07:19:00 PM
postImages/2024-07-13/1720878590_BridalRadhikaMerchant.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అనంత్, రాధిక పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.  రాధిక లెహంగా అధ్భుతంగా ఉంది . దీనిని డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.  ఈ లెహంగాలో రాధిక హీరోయిన్స్ అందరిని పక్కకు నెట్టేసింది. చాలా అందంగా ఉంది. పెళ్లి కూతురు మహారాణిలా కనిపించింది.  

లెహంగాపై వచ్చిన బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది. లెహంగా బాడీ కూడా బ్యాక్‌లెస్‌గా ఉంచి, రెండు వైపులా ఒకే ఫ్యాబ్రిక్ తయారు చేసిన మూడు స్ట్రిప్స్‌ ఉన్నాయి. అవన్నీ కూడా గోల్డ్ వర్క్‌తో ఉన్నాయి. గోల్డ్ జరీ ...సిల్వర్ ను మిక్సప్ లో ఈ లెహంగా డిజైన్ చేశారు మనీష్ మల్హోత్రా. రాధిక డ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ బెనారసీ దుప్పట్టా..రాధిక అంబానీ తన తలపై అందమైన పింక్ ఎంబ్రాయిడరీ బనారసీ దుపట్టా వేసుకుంది. ఈ దుప్పట్టా రాధికను మరింత హైలెట్ చేసింది. మహారాణి లా అనిపించింది.


పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ధరించిన ఆరెంజ్ కలర్ షేర్వానీ  కూడా అందరినీ ఆకట్టుకుంది. పూర్తిస్థాయి గుజరాతీ సంప్రదాయ పద్దతిలో రూపొందించారు. ఈ డ్రెస్ కు సంబంధించి ఎంబ్రాయిడరీ చేతితో చేయించారు. ఘాగ్రాకు విలువైన రత్నాలను పొదిగారు. 5 మీటర్ల పొడవున్న ఈ ఘాగ్రా హెడ్ వీల్, టిష్యూ షోల్డర్ తో సహా మూడు అంచుల్లో మెరుస్తూ కనిపిస్తుంది. తంబా టిక్కీలు, రెడ్ రేషమ్ తో అత్యంత లగ్జరీగా రూపొందించారు. తల మీద ఉండే ముసుగు జాలీ కట్ వర్క్ ను కలిగి ఉంది. మొత్తంగా వెడ్డింగ్ డ్రెస్ లో రాధిక మర్చంట్ యువరాణిలా కనిపించింది. రేటు బయటపెట్టకపోయినా ..రత్నాలు పొదిగిన డ్రెస్ అంటే లక్షల్లో ఉండొచ్చంటున్నారు బాలీవుడ్ వర్గాలు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style ananth-ambani radhika-marchant

Related Articles