ఓజీ రిలీజ్ చేస్తే మా భాష కు ప్రాధాన్యత తక్కువైపోతుంది..మా సినిమాలు మాత్రమే చూడాలని గొడవ చేశారు. మరి ఇప్పుడు దసరా కి కాంతార చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అసలే కర్ణాటక ప్రజలకు బయట భాషలు పడవు. ఏ సినిమా రిలీజ్ చెయ్యి ...కాన్సప్ట్ ఉందో లేదో వాళ్లకి అనవసరం ఫస్ట్ బాయ్ కట్ చెప్తారు. ఎప్పుడో రిలీజ్ అయిన బాహుబలి నుంచి ఇప్పుడు ఓజీ వరకు ఏ సినిమారిలీజ్ చేసినా బాయ్ కట్ అనేవాళ్లే. తీరా ముక్కి మూలిగి థియేటర్లు సంపాదించి మూవీ రిలీజ్ చేస్తే కన్నడ భాషా వాదులు నిరసనలు మొదలుపెడతారు. ఇప్పుడు ఎందుకు సార్ ఇదంతా అంటారా ...ఓజీ రిలీజ్ చేస్తే మా భాష కు ప్రాధాన్యత తక్కువైపోతుంది..మా సినిమాలు మాత్రమే చూడాలని గొడవ చేశారు. మరి ఇప్పుడు దసరా కి కాంతార చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ చెయ్యి చిన్న హీరో పెద్ద హీరో ఎవ్వరైనా కర్ణాటక లో మరో భాష చిత్రాలను చూడ్డానికి ఒప్పుకోరు. ఇంకా హైలెట్ ఎంటంటే ఏ కన్నడ హీరో కూడా ఈ గొడవలు చెయ్యొద్దని ఎప్పుడు చెప్పలేదు. కనీసం రియాక్ట్ అవ్వడం లేదు. మరి ఇప్పుడు తెలుగు జనాలు కూడా కాంతార చాప్టర్ 1 ను లైట్ తీసుకుంటారా ..లేక ఏం చేస్తారనేది చూడాలి.
అందులోను నిన్న నిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద లో పెట్టారు. ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి రిషబ్ శెట్టి కి సపోర్ట్ చేశాడు కూడా.రిషబ్ శెట్టి ఇక్కడ కూడా కన్నడ బాషలో మాట్లాడం వైరల్ అవుతుంది. తెలుగు రాదు ...సరే కాని ఇంగ్లీష్ తెలుగు మ్యానేజ్ చేస్తూ కూడా మాట్లాడకపోవడం ఇప్పుడు జనాలను ఆలోచించేలా చేస్తుంది. హైదరాబాద్ లో ఈవెంట్ పెట్టుకొని కన్నడ లో మాట్లాడితే ఎవరికి అర్ధమవుతుందనేది నెటిజన్ల క్వశ్చన్. మీ బెంగుళూరులో మా తెలుగు సినిమా రిలీజ్ అయితే మీ బాష ప్రాధాన్యత లేదని గొడవ పడే మీరు ...హైదరాబాద్ లో కన్నడలో మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న టాపిక్.గతంలో మన మంగ్లీ తెలుగులో పాటలు పాడిందని కర్ణాటకలో దాడి చేశారు. అయినా మన తెలుగు వాళ్లు మంచోళ్లు ...ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా సినిమా మాత్రం చూస్తారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.