తనకు క్యాన్సర్ కాదని ..జబ్బేంటో తెలీదు కాని ట్రీట్మెంట్ కు వెళ్తున్నాని చెప్పడంతో ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ కన్నడ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ కొడుకు శివరాజ్ కుమార్ వ్యాధి బారిన పడినట్లు శివరాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. అయితే శివరాజ్ కు క్యాన్సర్ ఉన్నట్లు కన్నడ మీడియా కోడై కూస్తుంది. అయితే ఇప్పుడు తను ట్రీట్మెంట్ కు అమెరికా వెళ్తున్నట్లు తెలిపారు శివరాజ్. అంతేకాదు తనకు క్యాన్సర్ కాదని ..జబ్బేంటో తెలీదు కాని ట్రీట్మెంట్ కు వెళ్తున్నాని చెప్పడంతో ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు.
1974లో 'శ్రీ శ్రీనివాస కల్యాణం' చిత్రంలో బాలనటుడిగా అరంగేట్రం చేసిన ఆయన, 1986లో 'ఆనంద్' అనే కన్నడ చిత్రంలో హీరోగా నటించారు. తొలి చిత్రానికే ఉత్తమ నూతన నటుడిగా సినీ ఎక్స్‌ప్రెస్ అవార్డును గెలుచుకున్న శివ రాజ్‌కుమార్ తర్వాత తర్వాత యాక్షన్ హీరోగా సెటిల్ అయినా ఇప్పుడిప్పుడు తెలుగు , తమిళ్ లో కూడా నటిస్తున్నారు.
'జైలర్' చిత్రంలో రజనీకాంత్ స్నేహితుడు నరసింహగా , 'కెప్టెన్ మిల్లర్'లో , 'దళపతి 69 కూడా ఓ ఇంపార్టెంట్ క్యారక్టర్ చేస్తున్నారు . రామ్ చరణ్ `ఆర్‌సీ16`లో ఓ బలమైన పాత్రలో కనిపించబోతున్నారు శివరాజ్ కుమార్. అయితే ఆయన యాక్టర్ మాత్రమే కాదు సింగర్ కూడా . దాదాపు 20 పాటలు పాడారు. ప్రస్తుతానికి 6 సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. చికిత్స కోసం అమెరికా వెళ్తున్నందున, శివ రాజ్‌కుమార్ తాను నటించాల్సిన చిత్రాల నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణం విన్న తర్వాత కన్నడ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఇంతలోనే శివరాజ్ కూడా క్యాన్సర్ అంటే మరింత బాధపడుతున్నారు ఫ్యాన్స్ .