STHREE2: OTT లోకి స్త్రీ ..2 మూవీ ..డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కడ ?

ఈ సినిమా థియేటర్ లో ఆగష్టు 15 న రిలీజ్ అయ్యింది. థియేటర్లో జనాలకు తెగ నచ్చేసింది. ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు జనాలు.


Published Sep 10, 2024 08:18:00 AM
postImages/2024-09-10/1725936661_cr202407186698dc4f5b48d.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎన్ని దయ్యం సినిమాలు వచ్చినా జనాలు దయ్యం సినిమాలకు పడిచస్తారనడానికి స్త్రీ 2 సినిమానే నిదర్శనం . 2018లో రిలీజ్ అయినా స్త్రీ మూవీకి ఎలాంటి క్రేజ్ లభించిందో తెలియనిది కాదు. దింతో ఇప్పుడు హర్రర్ మూవీస్ కి పెరుగుతున్న క్రేజ్ చూసి.. ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకు సిక్వెల్ గా స్త్రీ 2 ను రూపొందించారు మేకర్స్. ఈ సినిమా థియేటర్ లో ఆగష్టు 15 న రిలీజ్ అయ్యింది. థియేటర్లో జనాలకు తెగ నచ్చేసింది. ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు జనాలు.


25 కోట్ల తో తీసిన సినిమా ..దాదాపు 750 కోట్లు కొల్లగొట్టిందంటే మామూలు బ్లాక్ బాస్టర్ కాదు. బాలీవుడ్ కు ఇది చాలా మంచి కమ్ బ్యాక్. 2024 రిలీజ్ అయినా హిందీ సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్‍తో పాటు పంజక్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. అమర్ కౌశిక్ డైరక్షన్ లో ఈ వచ్చిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. 


సినిమా అంతా మధ్యప్రదేశ్ లో జరుగుతున్నట్లు చూపిస్తారు. దుష్టశక్తులు , దయ్యాలు ఆడవారిని హరిస్తూ ఉంటాయి. వాటిని కనిపెట్టే పనిలో కొంతమంది ఉంటారు. డైరక్షన్ చాలా బాగుంది. అయితే  హిందీతో పాటు తెలుగు , తమిళం , మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.. ఇక ఈ మూవీలో రాజ్‌కుమార్ రావ్‌, శ్ర‌ద్ధాక‌పూర్ యాక్టింగ్‌తోపాటు.. మూవీ లో చూపించిన ఊహించని ట్విస్ట్ లకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఓ చిన్న సినిమా సూపర్ డూపర్ హిట్టు అయ్యిందంటే ఆలోచించండి.
 

newsline-whatsapp-channel
Tags : -ott-movies amazon-prime-ott super-hit stree-2-movie

Related Articles