food: గోధుమపిండి తో టేస్టీ స్వీట్ ...జస్ట్ హెల్దీ అంతే !

ఈ స్వీట్ ...పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు.


Published Jun 06, 2025 08:02:00 PM
postImages/2025-06-06/1749220404_PaneerJilebi1.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇంట్లో ఉన్నపుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎప్పుడు బయటినుంచి తెచ్చుకోవడమేనా ..ఓ సారి ఇంట్లో టేస్టీ గా సింపుల్ గా ఓ రెసిపీ చేసి చూడండి. గోధుమపిండి...రవ్వ తో చేసే ఈ స్వీట్ ...పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు.ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


తీసుకోవాల్సిన పదార్థాలు :


పంచదార - ఒకటిన్నర కప్పులు


యాలకుల పొడి - పావుటీస్పూన్

నిమ్మరసం - అర చెక్క


బొంబాయి రవ్వ - అర కప్పు

పిండి - ముప్పావు కప్పు


ఉప్పు - చిటికెడు


పెరుగు - అర కప్పు


వంటసోడా - కొద్దిగా


నూనె - వేయించడానికి తగినంత


ముందుగా కాస్త పంచదార స్టవ్ మీద పాకం తీసి పెట్టుకొండి. ఇందులో కాసింత ఇలాచి పౌడర్ వేసుకొండి, ఇందులో నిమ్మకామ పిండుకుంటే చక్కెర సిరప్ గట్టిపడదు. ఇప్పుడు కాసింత బొంబయి రవ్వ , తీసుకొని మిక్సీ లో పిండి చేసుకొండి. గోధుమపిండి, చిటికెడు ఉప్పు, నూనె, కొంచెం పులిసిన పెరుగు వేసుకొని పిండి మొత్తం చక్కగా కలిసేలా కలపాలి. దీనిలో వాటర్ మిక్స్ చేసుకుంటూ పిండిని ఐదు నుంచి 10 నిమిషాల పాటు చేతితో బాగా వత్తుతూ కలుపుకోవాలి. గోధుమరవ్వ నాని మెత్తగా అవుతుంది. 

అనంతరం అందులో వంటసోడా, రెండు టీస్పూన్ల వాటర్ వేసుకొని మరోసారి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొండి. ముందుగా రెడీ చేసుకున్న పిండిని చక్కగా ఆయిల్ లో జిలేబీ వేసుకొండి. 


అవి మంచిగా వేగిన తర్వాత గరిటెతో తీసుకొని మరో బర్నర్ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొద్దిగా వేడిగా ఉన్న పాకంలో వేసి 5 నిమిషాల పాటు వదిలేయాలి. అవి నూనెలో బాగా వేగిన తర్వాత  ఒక ప్లేట్ లో తీసుకొని వాటిపై కాసింత బాదం పిస్తా తో గార్నిష్ చేసుకొండి పదిహేను నిమిషాల్లో సూపర్ స్వీట్ రెడీ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu food, taste sweets

Related Articles