Devara:'దేవర' మూవీని రిజెక్ట్ చేసిన హీరో..ఎవరంటే.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రంతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో  రాబోతున్న చిత్రం దేవరతో  సెప్టెంబర్ 27వ తేదీన మన ముందుకు


Published Sep 15, 2024 11:33:52 AM
postImages/2024-09-15/1726380232_jr.jpg

న్యూస్ లైన్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రంతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో  రాబోతున్న చిత్రం దేవరతో  సెప్టెంబర్ 27వ తేదీన మన ముందుకు రాబోతున్నారు. ఇందులో జాన్వికపూర్ కథానాయికగా  నటిస్తూ ఉండగా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్  ప్రముఖ పాత్రలో నటిస్తున్నారట. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ చిత్రం  మొదటి భాగం ఈ నెలలో విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రానికి ముందు ఆయన ఆచార్య చిత్రంతో మన ముందుకు వచ్చారు కానీ అది భారీగా డిజాస్టర్ అయింది.

అయినా ఆయనను నమ్మి  జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఒప్పుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్, పోస్టర్స్, పాటలు అద్భుతమైన ఆదరణ పొందాయి. అలాంటి ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఈ సందర్భంలోనే దేవర చిత్రానికి ముందుగా హీరోగా అనుకోలేదట. ముందుగా ఈ సినిమాకు అల్లు అర్జున్ తో తీద్దామని అనుకున్నారట.

కథ, స్క్రీన్ ప్లే అంతా సిద్ధమైన తర్వాత బన్నీకి కాస్త నచ్చకపోవడంతో నేను చేయనని చెప్పారట. దీంతో ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చిందట. ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని అక్టోబర్ 27వ తేదీన మన ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi news-line jr-ntr allu-arjun devara ramcharan koratala-shiva

Related Articles