Savitri: మహానటి సావిత్రికి ఆ స్టార్ డైరెక్టర్ తమ్ముడు అవుతారా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. ఇందులో మహానటి సావిత్రి అంటే ఎంతటి ఆదరాభిమానాలు పొందిందో మనందరికీ తెలుసు. ఆమె ఇండస్ట్రీలో ఎంత ఎదిగిందో చివరి రోజుల్లో అంత దారుణంగా  పరిస్థితులు .


Published Sep 29, 2024 06:20:00 PM
postImages/2024-09-29/1727608688_SAVITRI.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. ఇందులో మహానటి సావిత్రి అంటే ఎంతటి ఆదరాభిమానాలు పొందిందో మనందరికీ తెలుసు. ఆమె ఇండస్ట్రీలో ఎంత ఎదిగిందో చివరి రోజుల్లో అంత దారుణంగా  పరిస్థితులు అనుభవించింది.  ఆమె సినిమాల్లో హీరోయిన్ గా చేసే కాలంలో దర్శక, నిర్మాతలు స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారు.

అలా ఇండస్ట్రీలో ఎన్నో  అద్భుతాలు సృష్టించి మహానటిగా మారింది.  అలాంటి మహానటి సావిత్రి ఇండస్ట్రీలో ఎవరినైనా సరే పేరు పెట్టి పిలవకుండా ఒక రిలేషన్ తో పిలిచేదట. ఇక ముఖ్యంగా  ఆ స్టార్ డైరెక్టర్ ని మాత్రం తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచేదట. అంతేకాదు ఆ డైరెక్టర్  తన ఇంట్లో ఒకరిగా చూసుకునేదట.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే  దివంగత నటుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈయన కూడా సావిత్రిని అక్కయ్య అంటూ ఆప్యాయంగా పిలిచేదట.  ఇలా ఇద్దరి మధ్య అక్క, తమ్ముళ్ల బంధం ఎంతో కాలం నిలిచి ఉందట. ఒకానొక సమయంలో వీరిద్దరూ సొంత అక్క, తమ్ముళ్ళా అని కూడా అనుకునేవారట.  

అలా సావిత్రి చనిపోయిన తర్వాత దాసరి నారాయణరావు చాలా ఇంటర్వ్యూలో సావిత్రి గురించి చెబుతూ మా అక్కను ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చేవారు. ఆమె వల్లే నేను ఇంతటి స్థాయికి వచ్చానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా అనేకం  ఉన్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line tollywood mahanati savitri savitri-brother dasari-narayana-rao

Related Articles