ఈ నెల 16న తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఈ నెల 16న తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావల్సిన నిధులపై మోడీతో చర్చించే అవకాశం ఉంది. కాగా, ఈ భేటీపై పులు అనుమానలు కలుగుతున్నాయి. గురు-శిష్యులు ఇద్దరూ కలిసి రాష్ట్రానికి ఏం చేస్తారు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అవనున్నారు. ప్రధానంగా అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాల అంశలపై బాబు చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలపై కూడా చంద్రబాబు మోడీని కలసి వినతిపత్రాన్ని అందించనున్నారు. బాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇప్పుడు మూడోసారి హస్తినకు వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలవనున్నారు.
అదే రోజున సీఎం రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశం కానున్నారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణమాసంలో పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్‌కు సూచించారు. దీంతో ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.