Airports: ఎయిర్‌పోర్టుల్లో రేట్ల ను భయపడుతున్నారా ...ఇక పై నో టెన్షన్ !

చిన్న చిప్స్ ప్యాకెట్ కూడా భారీ రేట్లు. అయితే ఇక పై ఆహార పదార్ధాల రేట్లు ఇంత ఎక్కువ రేట్లు ఉండవట.


Published Nov 11, 2024 03:50:00 PM
postImages/2024-11-11/1731320484_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఎయిర్ పోర్టు అనగానే అఫర్ట్ బుల్ కాదు..బాబోయ్ బోలెడు రేట్లు...ఇక పై ఇవన్నీ ఉండవంటున్నారు . అది కూడా ముఖ్యంగా ఫుడ్ విషయంలో ...పొరపాటున ఆకలితో వెళ్తే ...అక్కడి రేట్లకు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చే వరకు కడుపు మాడ్చుకోవల్సిందే. చిన్న చిప్స్ ప్యాకెట్ కూడా భారీ రేట్లు. అయితే ఇక పై ఆహార పదార్ధాల రేట్లు ఇంత ఎక్కువ రేట్లు ఉండవట.


అయితే సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సరసమైన ధరలకే ఆహారం, పానీయాలను విక్రయించేందుకుగానూ ‘ఎకానమీ జోన్‌’లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోజుల్లో సామాన్యులు కూడా ఫ్లైట్ జర్నీలు ఎక్కువగా చేస్తున్నారు. అందరు బిజినెస్ క్లాసులే ఉండరు కదా...ఎకానమీ వెళ్లే వారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని రేట్లు మాత్రం బిజినెస్ క్లాస్ వాళ్లకి అనుగుణంగా ఉంటాయి. ఇక పై అలా కాకుండా ఎకానమీ జోన్ కూడా ఉంటాయి.

ఎకానమీ జోన్ల ప్రారంభం అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు దఫాలు చర్చించి ఏకాభిప్రాయం సాధించారని అధికారులు చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎయిర్‌పోర్ట్‌లలోని ఫుడ్ అవుట్‌లెట్‌లతో పాటు ఇతర ఏజెన్సీలు ఎకానమీ జోన్లను నిర్వహించనున్నాయని తెలిపారు.
ఈ ఎకానమీ జోన్లు  మొదట ...కొత్తగా కట్టిన ఎయిర్ పోర్టుల్లో అమలులోకి వస్తాయి. తరువాతే పాత ఎయిర్ పోర్టులో వస్తాయి. కాని దేశంలో అన్ని ఎయిర్ పోర్టులో అతి తక్కువ టైంలోనే ఈ ఎకానమీ జోన్ లు స్టార్ట్ అవుతాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu airport

Related Articles