ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద డబ్బులు తీసుకున్న వివాహితులు.. తమ భర్తలను వదిలి ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో మహారాజ్ గంజ్ జిల్లాలో జరిగిందిద. కేంద్రప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఆర్దిక సాయం అందజేస్తోంది. ఈ క్రమంలో మహారాజ్‌గంజ్‌కు చెందిన 11 మంది మహిళలకు పీఎంఏవై మొదటి విడతగా అందిన రూ.40,000 నగదు తీసుకుని వాళ్ల లవర్స్ తో పారిపోయారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద డబ్బులు తీసుకున్న వివాహితులు.. తమ భర్తలను వదిలి ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో మహారాజ్ గంజ్ జిల్లాలో జరిగిందిద. కేంద్రప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఆర్దిక సాయం అందజేస్తోంది. ఈ క్రమంలో మహారాజ్‌గంజ్‌కు చెందిన 11 మంది మహిళలకు పీఎంఏవై మొదటి విడతగా అందిన రూ.40,000 నగదు తీసుకుని వాళ్ల లవర్స్ తో పారిపోయారు.
మహారాజ్‌గంజ్ జిల్లాల్లో మొత్తం 2,350 మంది లబ్దిదారులకు ఇల్లు మంజూరు కాగా.. మొదటి విడత నగదు వారి బ్యాంకు ఖాతాలకు జమచేశారు. తుతిబరి, షీత్లాపూర్, చాటియా, రాంనగర్, బకుల్ దిహా, ఖాస్రా, కిషూన్‌పూర్, మేధౌలీ గ్రామాలు లబ్ధిదారులు ఇందులో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకొని పారిపోయిన వారికి రెండో విడత డబ్బులు రాకుండా నిలిపివేస్తామని తెలిపారు అధికారులు.
గతేడాది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.50 వేలు చొప్పున అందుకున్న నలుగురు మహిళలు.. ప్రియుళ్లతో కలిసి పరారయ్యారు. డబ్బులు జమ అయినా ఇళ్ల నిర్మాణాలు ఇంకా మొదలుకాకపోవడంతో వారి కుటుంబాలకు నోటీసులు పంపినా.. ఎటువంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. దీనిపై విచారణలో భాగంగా జిల్లా పట్టణాభివృద్ధి విభాగం నలుగురు భర్తలకు నోటీసులు పంపి.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలియజేయాలని కోరింది.