ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాము నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని... కానీ తానేమీ అద్దాల మేడలో ఉండటం లేదన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రధానమోదీ గత పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించి వారి కలలను సాకారం చేశామని మోదీ తెలిపారు. ఈరోజు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాము నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని... కానీ తానేమీ అద్దాల మేడలో ఉండటం లేదన్నారు. నిజానికి తనకు ఇళ్లే లేదని అది భారత్ ప్రజలకు తెలిసని అన్నారు.
ఢిల్లీ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం లిక్కర్, స్కూల్, పొల్యూషన్ స్కాంలకు పాల్పడిందని విమర్శించారు. గత పదేళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు చుట్టుముట్టిందని ఆమ్ ఆద్మీపార్టీని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు ప్రజలు ఆ విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిధ్ధమయ్యారని మోదీ అన్నారు.