World Population: 2024 చివరికి ప్రపంచ జనాభా ఎంతంటే !

2025 లో ప్రతి సెకనుకు 4.2 జననాలు , 2 మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది. 


Published Dec 31, 2024 12:09:00 PM
postImages/2024-12-31/1735627265_photoworldpopulationdayhugecrowedpeople8kbackground28546844.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రపంచ జనాభా 2024 చివరి నాటికి 7.1 కోట్లు పెరిగిందని లెక్కలు చెబుతున్నారు యూఎస్ సెన్స‌స్ బ్యూరో అంచ‌నా వేసింది. మొత్తానికి 0.9 శాతం పెరుగుదల నమోదయ్యిందిద. అయితే గతేడాది తో పోలిస్తే స్వల్ప తగ్గుదల ఉందని పేర్కొంది . 2025 లో ప్రతి సెకనుకు 4.2 జననాలు , 2 మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది. 


ఇక అమెరికా జ‌నాభా 26 ల‌క్ష‌లు పెరిగి 34.1కోట్ల‌కు (341,145,670) చేరుకుంటుందని యుఎస్ సెన్సస్ బ్యూరో వెల్ల‌డించింది. యూఎస్ జనాభా సెకన్ కు ఓ వలస దారుడితో యూఎస్ జనాభా పెరుగుతున్నట్లు సర్వే చెబుతుంది.


జనవరి నుంచి ఈ ఏడాది చివ‌రికి 0.78 శాతం (26,40,171) పెరుగుదల న‌మోదైంద‌ని పేర్కొంది. 


అలాగే 2025లో దేశంలో 9 సెక‌న్ల‌కు ఒక జ‌న‌నం, 9.4 సెక‌న్ల‌కో మ‌ర‌ణం న‌మోద‌వ్వ‌చ్చ‌ని సెన్స‌స్ బ్యూరో అంచ‌నా వేసింది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america india

Related Articles