ఓ అంతరిక్ష మిషన్ కోసం రోదసిలోని ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీతా, విల్మోర్... వారిని తిరిగి తీసుకువచ్చే వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మనం ఎక్కడైనా ఇరుక్కుపోయాం...బయటకు వస్తామో లేదో ...అసలు రాగలమో తెలీకపోతే సగం అక్కడే చనిపోతాం. కాని సునీతా విలియమ్స్ చాలా ధైర్యంగా ఉన్నారు. 9 నెలలు పాటు మనో ధైర్యంతో పోరాడి ఎట్టకేలకు ఐఎస్ ఎస్ కు సునీతా విలియమ్స్ చేరారు.
ఓ అంతరిక్ష మిషన్ కోసం రోదసిలోని ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీతా, విల్మోర్... వారిని తిరిగి తీసుకువచ్చే వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 10 నెలల పాటు చిక్కుకొని ఇప్పుడు భూమ్మీదకు రావడానికి సిధ్దపడుతున్నారు..డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్ఎస్ ను చేరుకుంది.
ఆ వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్ కు చేరుకున్న క్రూ-10 వ్యోమగాములను చూశాక సునీతా విలియమ్స్ ఆనందం వర్ణనాతీతం. ఆమె ముఖం నవ్వులతో వెలిగిపోయింది.సునీతా విలియమ్స్ లో బ్రతికిబట్టగట్టాం అనే ఫీలింగ్ స్పష్టంగా కనిపించింది. కెమెరాతో ఫొటోలు తీసుకుంటూ, డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.