వీరి సుదీర్ఘ నిరీక్షణ నేపథ్యంలో వారికి చెల్లించే జీతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (iss) లో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిదినెలలకు పైగా చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ మార్చి 19న తిరిగి భూమికి రానున్నారు. వీరి మిషన్ ఫస్ట్ ఎనిమిది రోజులు అనుకొని ప్రణాళికతో ప్రారంభమైంది. అయితే సాంకేతిక సమస్యలతో వారిద్దరూ ఐఎస్ఎస్ లో నే చిక్కుకుపోయి 9 నెలలు బలవంతంగా గడపాల్సి వచ్చింది. వీరి సుదీర్ఘ నిరీక్షణ నేపథ్యంలో వారికి చెల్లించే జీతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రిటైర్డ్ నాసా వ్యోమగామి క్యాడీ కోల్ మన్ తెలిపిన వివరాల ప్రకారం వ్యోమగాములకు ప్రత్యేకంగా ఓవర్ టైమ్ జీతం ఉండదు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలోని వారి సమయాన్ని భూమిపై సాధారణ పని దినంగానే పరిగణిస్తారు. ఐఎస్ ఎస్ లో వారి ఆహారం ఇతర ఖర్చులను నాసా భరిస్తుంది. వారికి సాధారణ జీతం యధావిధిగా అందుతుంది. అదనంగా రోజుకు 4 డార్లు అంటే రూ.347 చొప్పున వ్యక్తిగత ఖర్చుల కోసం చెల్లిస్తారు.
కోల్‌మన్ 2010-11లో 159 రోజుల మిషన్‌లో భాగంగా అదనంగా 636 డాలర్లు (రూ.55,000) అందుకున్నారు. అదేవిధంగా సునీతా విలియమ్స్, విల్మోర్ 287 రోజులు గడిపినందుకు అదనంగా ఒక్కొక్కరికి 1,148 డాలర్లు (సుమారు రూ.లక్ష) అందుతుంది. నిజానికి ఉద్యోగుల వార్షిక మూల వేతనం సుమారు రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్ల వరకు) ఉంటుంది.