Sunita Williams: మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్ !

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది.


Published Mar 17, 2025 12:13:00 PM
postImages/2025-03-17/1742193835_nasa17417698235211741769825810.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమ్మీదకు చేరుకునే టైం వచ్చింది. ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా స్పేస్ సెంటర్ లో చిక్కుకుపోయారు. బచ్ విల్మోర్ , సునీతా విలియమ్స్ తో పాటు మరి గంటల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది.


సునీతా , విల్మోర్ ను తీసుకొచ్చేందుకు రెండు రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ నిన్న సక్సస్ ఫుల్ గా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ-10 మిషన్ లో ని నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా ఐఎస్ ఎస్ లోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది.


అమెరికా కాలమానం ప్రకారం నేటి (సోమవారం) రాత్రి 10.45 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక క్రూ డ్రాగన్ అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం రేపు (మంగళవారం) సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యను దాటుకుని కిందికి వచ్చి 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అనంతరం అందులోని వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu earth space-center sunitha-willams-

Related Articles