ప్రయాగ్‌రాజ్‌కు 40 కోట్ల మందికి పైగా భక్తులను తీసుకువస్తుందని అధికారులు భావిస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా ఈ రోజు ఉదయం ఉత్తరప్రదే్శ లో ప్రయాగ్ రాజ్ లో ఘనంగా ప్రారంభమయ్యింది. గంగా , యమునా , సరస్వతి నదుల్లో కలిసే ఈ త్రివేణి సంగమం దగ్గర దాదాపు 50 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు.ప్రయాగ్‌రాజ్‌కు 40 కోట్ల మందికి పైగా భక్తులను తీసుకువస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సుమారు 4,000 హెక్టార్లలో ఏర్పాట్లు చేసింది.
45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో యూపీ ప్రభుత్వం దాదాపు 7 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. కాని ఉత్తరప్రదేశ్ ఈ డబ్బు చాలా తక్కువ. కుంభమేళా ద్వారా దాదాపు 2 లక్షల కోట్లు ఆదాయం యూపీకి చేరుతుంది.40 కోట్ల మంది సందర్శకులు ఒక్కొక్కరు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఈ మెగా ఈవెంట్ ద్వారా రూ. 2 లక్షల కోట్ల వరకు ఉత్తరప్రదేశ్ రాష్త్రం ఆర్జించవచ్చని చెబుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... 2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించిందని అన్నారు. అది చాలా చిన్న మేళా ..ఈ కుంభమేళా చాలా పెద్దది కాబట్టి ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని అంచనా వేస్తున్నారు.