పెన్సిల్ మొనపై సూక్ష్మ రూపాన్ని చెక్కారు. దీని కోసం దాదాపు గంటసేపు శ్రమించానని, ఫోర్‌బీ పెన్సిల్ మొనపై దీన్ని చెక్కినట్టు వెంకటేశ్ చెప్పారు. 12mm ఎత్తులో, 4mm వెడల్పుతో తన ఆర్ట్ ఉందని ఆయన అన్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నేషనల్ యూత్ డే సందర్భంగా ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్, గిన్నిస్ రికార్డ్ విజేత గట్టెం వెంకటేశ్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పిడికిలి బిగించి, కర్తవ్య దీక్షతో ముందుకు నడిచే యువతకు స్ఫూర్తిగా నిలిచేలా పెన్సిల్ మొనపై సూక్ష్మ రూపాన్ని చెక్కారు. దీని కోసం దాదాపు గంటసేపు శ్రమించానని, ఫోర్‌బీ పెన్సిల్ మొనపై దీన్ని చెక్కినట్టు వెంకటేశ్ చెప్పారు. 12mm ఎత్తులో, 4mm వెడల్పుతో తన ఆర్ట్ ఉందని ఆయన అన్నారు.
గట్టెం వెంకటేశ్ చాలా యేళ్లుగా ఈ కళలపై తన ఆసక్తి ని కనబరించారు. గిన్నిస్ రికార్డును కూడా పొందారు. చిన్ననాటి నుంచి ఇలాంటి సూక్ష్మ కళపై ఆసక్తి పెంచుకున్న వెంకటేష్ పెన్సిల్ ముల్లు, చిత్తుకాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా 500కిపైగా కళాకృతులను రూపొందించి వందకు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.