రూ. 40 లక్షల విలువగల బంగారు మాంజాను తయారు చేసినట్లు కూడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పంతంగులు ఎగురవేయడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అదో సరాదా . అయితే ఆ సరదా కాస్త రిచ్ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో ఆలోచించి సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాడు.హైదరాబాద్ కు చెందిన ఓ గోల్డ్ మ్యాన్ వినూత్న రీతిలో ఆలోచించాడు. సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. అది కూడ రూ. కోటి విలువగల బంగారు పతంగును ఎగురవేస్తున్నట్లు, అలాగే రూ. 40 లక్షల విలువగల బంగారు మాంజాను తయారు చేసినట్లు కూడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇప్పుడు సోషల్ మీడియా సంగతి తెలిసిందేగా ..వివరం తెలీకుండా ఎగబడుతున్నారు. ఇఫ్పుడు ఓల్డ్ సిటీలో గోల్డ్ మ్యాన్ తను కోటి రూపాయిల కైట్ ను ఎగురవేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆ కోటి రూపాయిల కైట్ కోసం ఓల్డ్ సిటీ యువత ...ఎగబడుతున్నారు. ఎక్కడ తోపులాట జరుగుతుందో అని పోలీసులు అలర్ట్ అయ్యారు కూడా. కాని ఆ ప్రచారం ఇంకా జరుగుతుంది.పోలీసులు ఈ ప్రకటన ఏ మేరకు వాస్తవమో తెలుసుకునేందుకు విచారిస్తున్నట్లు సమాచారం. కాని ఆ గోల్డ్ మ్యాన్ ఈ వార్త అబధ్దం అని కాని నిజమని కాని కన్ఫెస్ చెయ్యకపోవడంతో పోలీసులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.