వేల కోట్ల బిజినెస్ అవుతుంది. అసలు ఒక్క సంక్రాంతి కలిసి వస్తే చాలు లైఫ్ మారిన వాళ్లు ఎంత మంది ఉన్నారో.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సంక్రాంతి అన్ని రాష్ట్రాలు వేరు ...ఆంధ్రా వేరు..సంక్రాంతి అంటే ఏడాది పాటు గుర్తుంచుకునే వేడుక. సంక్రాంతి అక్కచెల్లెల్లు ..అన్నదమ్ములు..సంక్రాంతి అప్పాలు ..సంక్రాంతి ఎన్నో నవ్వులు ..సంక్రాంతి తీర్ధాలు...సంక్రాంతి సినిమాలు ..కోళ్ల పందాలు ...సంక్రాంతి పేకాట ..ఇలా పిల్లా మేక ...అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే పండుగ. మగవాళ్లకి 99 శాతం పండుగ ..కోళ్ల పందాలు ..సినిమాలే ...పేకాట రాయుళ్లు ఇవే అసలు మజా . అలా అని కోళ్ల పందాలు అనగానే ..వందో వెయ్యో అనుకుంటే మీ పొరపాటే . ఈ ఒక్క నెల ఆంధ్రా కోళ్ల పందాలకు ఎన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతుందో తెలుసా .
అయితే.. కోడి పందాలంటే.. బరిలో రెండు పుంజులు పోట్లాడటం కాదు. వేల కోట్లు చేతులు మారడం కూడా ఎస్.. కొబ్బరి తోటల్లో జరిగే ఈ కోళ్ల యుద్ధాన్ని చూసి.. జబ్బలు, తొడలు చరుచుకునే పందెంరాయుళ్లు ఎందరో ఉన్నారు. ఎంతో మంది సొంతూరుకు రావడం కుదరదు కాని ఈ పందాలు ఆన్ లైన్ వేస్తుంటారు. లక్షలు చేతులు మారుతాయి. మరీ రేర్ బ్రీడ్ కోళ్ల పందాలు అయితే ...కోట్లు కూడా పందాలు వేస్తుంటారు. వేల కోట్ల బిజినెస్ అవుతుంది. అసలు ఒక్క సంక్రాంతి కలిసి వస్తే చాలు లైఫ్ మారిన వాళ్లు ఎంత మంది ఉన్నారో. టోటల్ కోనసీమ , తెలుగు రాష్ట్రాల్లో ఈ పందాల వల్ల దాదాపు 3 వేల కోట్లకు పైనే చేతులు మారతాయనే లెక్కలున్నాయ్. ఇది గతేడాది లెక్క...ఈ ఏడాది 6 వేల కోట్లకు పైగానే మార్కెట్ జరుగుతుందని వాకబు.
నిజానికి పందెం కోళ్లు ఒక్కో బరి దగ్గర ఏర్పాట్లకే దాదాపుగా 30 లక్షల దాకా ఖర్చవుతుంది. అంటే.. అక్కడ ఏ స్థాయిలో పందాలు నిర్వహిస్తారో లెక్కేసుకోవచ్చు. ఈ ఖర్చుని కూడా పందెం రాయుళ్ల నుంచే వసూలు చేస్తారు నిర్వాహకులు. కోళ్ల పందాలు నచ్చవా...అయితే అన్ని రకాల ఆటలు ఉంటాయి ..ఈ బరుల చుట్టూ గుండాట, పేకాట, మట్కా లాంటి జూదాలు కూడా నడుస్తుంటాయి. అక్కడే.. పందెం రాయుళ్లకు కావాల్సిన ఫుడ్, ఆల్కహాల్‌తో పాటు కావాల్సినవన్నీ దొరికేస్తాయి. మీరు వంద నుంచి ఎన్ని కోట్లయినా పందెం కట్టచ్చు. 10 లక్షలు పందెం కడితే దాదాపు 1 లక్ష రూపాయిలు కోళ్ల పందాలు ఆర్గనైజర్లకు వెళ్లిపోతాయి. గెలిచాక కూడా సేమ్ రూల్ .. కడుతున్నపుడు మీరు 1 లక్ష ఇచ్చినా గెలిచినపుడు మళ్లీ లక్షకు 10 వేలు వాళ్లకు ఇవ్వాల్సిందే. ఈ పందాలు ఏ రేంజ్ లో ఉంటాయంటే .. ఇంటి నుంచి వెళ్లేటపుడే ఆస్థి పేపర్లు కూడా పట్టుకొని వెళ్తారంటే మీరు ఆశ్చర్యపోతారు.