కొందరు పెట్స్ దూరం అయితే భరించగలరు మరికొందరు భరించలేరు. ఇలా భరించలేని ప్రేమతో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కొన్ని సార్లు మనకే అర్ధం కాదు ..మనం మన పెట్స్ ని ఎంత ఇష్టపడుతున్నామో ..ఒకానొక టైంలో అవి లేకపోతే మనం లేమేమో అనేంత ప్రేమించేస్తాం. కొందరు పెట్స్ దూరం అయితే భరించగలరు మరికొందరు భరించలేరు. ఇలా భరించలేని ప్రేమతో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక రాజశేఖర్ (33) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజశేఖర్ తొమ్మిదేళ్లుగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దాని పేరు బౌన్సీ. తన లోకమే ఆ డాగ్ .
అయితే ఆ డాగ్ అనారోగ్యంతో మంగళవారం నాడు చనిపోయింది. దాంతో అదే రోజు తన వ్యవసాయ క్షేత్రంలో దాని అంత్యక్రియలు నిర్వహించాడు. ఎందుకో ఆ బాధను బరించలేకపోయాడు . అదే రోజు తను కూడా చనిపోయాడు. అది కూడా బౌన్సీని కట్టడానికి ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకున్నాడు. బుధవారం ఉదయం చూసేసరికి తన ఇంట్లో శవమై కనిపించాడు. ఈ ఘటనపై మదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.