Cm Revanth: బెడిసికొట్టిన రేవంత్ రెడ్డి ప్లాన్

సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసికొట్టింది. తనని తాను ఏదో గొప్ప నాయకుడిలా నిరూపించుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రతిచోటా విఫలమవుతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి


Published Aug 14, 2024 03:54:20 PM
postImages/2024-08-14/1723631060_america2.PNG

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసికొట్టింది. తనని తాను ఏదో గొప్ప నాయకుడిలా నిరూపించుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రతిచోటా విఫలమవుతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఘోరంగా ఫెయిలయ్యిందని ఆయన ఆస్థాన మీడియా సంస్థలు కూడా రాస్తున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమల మంత్రి అవగానే ఆయన శాఖ సమీక్షా సమావేశం జరిపారు. అందులో జనవరిలో దావోస్‌లో జరిగే సమావేశానికి తెలంగాణ పెవిలియన్ సిద్ధమవుతున్నదని, గత ప్రభుత్వంలో కేటీఆర్ కృషితో సఫలీకృతమవుతున్న కొన్ని పెట్టుబడుల ప్రకటనలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారట. ఇది విన్న రేవంత్ వెంటనే శ్రీధర్ బాబుతో నేనూ వస్తాను దావోస్‌కు అన్నాడట. దీంతో శ్రీధర్ బాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంట పని అయిందని సమాచారం. ఏదో కేటీఆర్ డిజైన్ చేయించిన పెవిలియన్‌లో అప్పటికే సిద్ధం చేసిన కొన్ని పెట్టుబడులు అనౌన్స్ చేసి కొంత పేరు తెచ్చుకుందాం అనుకున్న శ్రీధర్ బాబు ఆశలకు అలా రేవంత్ ఆదిలోనే గండి కొట్టాడు.

తానే ఫోకస్‌లో ఉండాలనే రేవంత్ పథకం దావోస్ వేదికగా ఘోరంగా బెడిసికొట్టింది. వచ్చీ రాని ఇంగ్లీషులో “న్యూక్లియర్ చెయిన్ రియాక్షన్, ఒరిజినల్, డూప్లికేట్” అంటూ ఆ అంతర్జాతీయ వేదిక మీద తెలంగాణ పరువు గంగలో కలిపిండు రేవంత్. అంతే కాదు రెండు మూడు ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్లు ప్రకటించాడు అని అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. ఇప్పుడు మరోసారి విదేశీ పర్యటనలో స్వంత తమ్ముడి కంపెనీతో రూ. 1,000 కోట్ల ఒప్పందం అని ప్రకటించడాని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పరువు మూసీ నదిలో కలిసిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. 15 రోజుల విదేశీ పర్యటనలో రేవంత్‌ది ఒక్క నిముషం వీడియో కూడా బయటికి రాలేదు అంటేనే ఆయన టీం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందని ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. అయితే నిజానికి దావోస్ సమావేశానికి, నిన్నటి అమెరికా పర్యటనకు రేవంత్ పెద్ద మనసు చేసుకుని సౌమ్యుడు, మృదుభాషిగా పేరున్న శ్రీధర్ బాబును పంపించి ఉంటే, ఆయనేదో ఆయన స్థాయిలో పరువు నిలబెట్టేవాడు. కానీ రేవంత్ అత్యుత్సాహం, క్రెడిట్ కొట్టేయాలన్న తాపత్రయం వల ఇప్పుడు పరువు పోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : india-people congress cm-revanth-reddy america

Related Articles