నవంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 4,46130 మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కేరళ లో ప్రసిధ్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇరుముడితో భారీగా భక్తులు కేరళ చేరుకున్నారు. ఒక్క రోజులో దాదాపు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.ఒక్కరోజులోనే 96,007 మంది భక్తులు శబరిమలకు వచ్చినట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటను విడుదల చేశారు. వారిలో 70,000 మంది వర్చువల్ బుకింగ్స్, స్పాట్ బుకింగ్స్ ద్వారా 22,121 మంది, పుల్మేడ్ మీదుగా 3,016 మంది, ఎరుమేలి అటవీ మార్గం నుంచి 504 మంది భక్తులు వచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 4,46130 మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అయ్యప్ప స్వామికి ఈ మండల పూజ సందర్భంగా భక్తులు భారీగా చేరుకుంటారు . నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ దీక్ష చాలా మంది జ్యోతి దర్శనానికి కూడా వేస్తారు. అంటే మకర సంక్రాంతికి ఈ జ్యోతి దర్శనం జరుగుతుంది. తెలుగురాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ మండల దీక్షను ఎక్కువ ఆచరిస్తారు.
డిసెంబర్ 22 నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలు ముగియడం, క్రిస్మస్ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు కావడం వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాని ఈ రద్దీ దాదాపు సంక్రాంతి దాటే వరకు ఉండే అవకాశం ఉంది.