కొన్ని రెస్టారెంట్ల తీరు మారడంలేదు. ఫుడ్ కోసం వచ్చే కస్టమర్స్ కు పేరు తెలియని కొన్ని రకాల మాత్రలను పెట్టి ఇస్తున్నారు ఓ రెస్టారెంట్ వారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఫుడ్ బిజినెస్ చాలా లాభాలు వచ్చే బిజినెస్ . అందుకే లాభాలు రుచి చూసిన వాడు ఫుడ్ బిజినెస్ వదులుకోలేడు. బిజినెస్ డవలప్ అవ్వడానికి ఏ అడ్డమైన దారైనా తొక్కుతాడు. హైదరాబాదులోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కలుషిత ఆహారం వడ్డిస్తున్నట్టు ఇప్పటికే పలుమార్లు గుర్తించారు. అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొన్ని రెస్టారెంట్ల తీరు మారడంలేదు. ఫుడ్ కోసం వచ్చే కస్టమర్స్ కు పేరు తెలియని కొన్ని రకాల మాత్రలను పెట్టి ఇస్తున్నారు ఓ రెస్టారెంట్ వారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బావర్చి హోటల్ లో చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు దర్శనమిచ్చాయి. దాంతో కస్టమర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ టాబ్లెట్స్ ను వీడియో తీసే ప్రయత్నం చెయ్యగా యాజమాన్యం అడ్డుకుంది. అయితే అవి ఏం టాబ్లెట్స్ ఏంటనేది తెలీదు. కాని రీసెంట్ గా ఇదే హోటల్ లో బిర్యానీలో సిగరెట్ పీకలు దర్శనమిచ్చిన్లు వార్తల్లో ఫుల్ వైరల్ అయ్యింది. ఇప్పుడు బిర్యానీలో మాత్రలు కనిపించగా, అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.
గత ఆర్నెల్ల కాలంలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు జరిపి కొన్ని చోట్ల కేసులు నమోదు చేశారు. కొన్ని రెస్టారెంట్లకు జరిమానాలు కూడా విధించారు. అయితే పదే పదే తమ రెస్టారెంట్ కు అడిక్ట్ అయ్యేలా డ్రగ్స్ ఇస్తున్నారని వాదనతో పాటు ..ఫ్యామిలీ ప్లానింగ్ కు ఉపయోగపడే ..లేదా పిల్లలు పుట్టకుండా ఇచ్చే మందులు బిర్యానీలో ..మీట్ లో ఇస్తున్నారనే వాదన కూడా ఉంది. అయితే దీనిపై కేసు నడుస్తుంది. వివరాలు తెలియాల్సి ఉంది.