india pakistan Tensions: బంకర్ లో దాక్కున్న పాక్ ప్రధాని !

పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ.. భారీ భద్రత నడుమ ప్రధానిని బంకర్ లో భద్రపరిచారు. 


Published May 09, 2025 10:56:00 AM
postImages/2025-05-09/1746768459_PakistanIndiaKashmirShehbazSharif17465344321371746534432383.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాంబుల మోతతో పాకిస్థాన్ దద్దరిల్లుతుంది. పాకిస్థాన్ ప్రధాన నగరాలను భారత్ బాంబుల మోతతో పాకిస్తాన్ దద్దరిల్లుతోంది. పాక్ ప్రధాన నగరాలను భారత టార్గెట్ చేసింది. కిస్తాన్ దాడులతో భారత్ ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లు సమాచారం. పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ.. భారీ భద్రత నడుమ ప్రధానిని బంకర్ లో భద్రపరిచారు. 


అటు బాంబుల మోతతో పాకిస్థాన్ దద్దరిల్లుతుంది. పాక్ ప్రధాన నగరాలను భారత్ టార్గెట్ చేసింది. కరాచీ , ఇస్లామాబాద్ , లాహోర్ , సియోల్ కోట్ , బహవల్ పూర్ , పెషావర్ లో డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తోంది భారత్ . ఇండియన్ నేవీ దెబ్బకు పాక్ కు ఊపిరిఆడడం లేదు. అలా అని పాకిస్థాన్ ఏం ఊరుకోవడం లేదు . పాకిస్థాన్ బరి తెగించింది. ఓ వైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతున్న పాక్ అనూహ్యంగా గురువారం రాత్రి భారత్ పై దాడికి దిగింది. జమ్మూలోని ఎయిర్ పోర్ట్ సహా అనేక ప్రదేశాలపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది. భారత్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ఇది వచ్చే రాకెట్లను విజయవంతంగా అడ్డుకుంది. పాక్ డ్రోన్లు , జెట్లు , మిస్సైల్స్ ను భారత్ కూల్చేసింది. గురువారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, సాంబా, ఉరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu blast india pakistan

Related Articles