T-Square: హైదరాబాద్‌కు టైమ్స్ స్క్వేర్

 ప్రస్తుతం రాయదుర్గంలో ఉన్న ఎంటర్‌టైన్మెంట్ హబ్స్, కొలాబరేషన్ జోన్స్‌కి తోడు టి-స్క్వేర్ కూడా వచ్చి చేరనుంది. అయితే, సైట్ కోసం TGIIS కాన్సెప్ట్ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది. ప్రాజెక్ట్ కోసం పేరున్న ప్రైవేట్ డెవలపర్‌లను గుర్తించి, ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు TGIIS తెలిపింది.
 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-12/1720778462_modi81.jpg

న్యూస్ లైన్ డెస్క్: న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ లాగా హైదరాబాద్‌లో కూడా ఒక టైమ్స్ స్క్వేర్ ఏర్పాటు కానుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIS) రాయదుర్గంలో టి-స్క్వేర్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపడుతోంది. సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడానికి  టి-స్క్వేర్ ఏర్పాటు చేస్తున్నట్లు TGIIS వెల్లడించింది. 

దీంతో ప్రస్తుతం రాయదుర్గంలో ఉన్న ఎంటర్‌టైన్మెంట్ హబ్స్, కొలాబరేషన్ జోన్స్‌కి తోడు టి-స్క్వేర్ కూడా వచ్చి చేరనుంది. అయితే, సైట్ కోసం TGIIS కాన్సెప్ట్ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది. ప్రాజెక్ట్ కోసం పేరున్న ప్రైవేట్ డెవలపర్‌లను గుర్తించి, ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు TGIIS తెలిపింది.

టి-స్క్వేర్ పై ప్రదర్శించే ప్రకటనలు హైదరాబాద్ వాసులు, వాటాదారులలో ఉత్సాహాన్ని సృష్టించిందని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ పట్టణ ప్రకృతి దృశ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రధాన పర్యాటకంగానే కాకుండా, కమర్షియల్ సెంటర్‌గా సిటీ  స్టేటస్ కూడా పెంచుతుందని TGIIS తెలిపింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad telanganam timessquare raidurgam t-square tgiic

Related Articles