Sandhya Theatre:సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ..శ్రీతేజ్ కోలుకున్నాడు !

ట్యూబ్ ద్వారా చిన్నారికి ఆహారం అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు.


Published Dec 21, 2024 12:54:00 PM
postImages/2024-12-21/1734765925_sandhyatheater0512241.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుష్ప-2 ప్రీమియర్ షో సంధర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తన కొడుకు శ్రీతేజ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు.  ఆమె కుమారుడు శ్రీతేజ్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్న శ్రీతేజ కళ్లు తెరుస్తున్నాడట. చికిత్సకు స్పందిస్తున్నాడట. ట్యూబ్ ద్వారా చిన్నారికి ఆహారం అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun arrest

Related Articles