Andhra Pradesh: ఏపీలో మరోసారి భూకంపం.. !

శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెప్పారు


Published Dec 21, 2024 12:04:00 PM
postImages/2024-12-21/1734762903_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  ఆంధ్రప్రదేశ్ లో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూకంపనలు ఏర్పడ్డాయి. ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో చాలా చోట్ల భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర ఆందోళనలు ఏర్పడ్డాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెప్పారు. ముండ్లమూరు ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్ధులు బయటకు పరుగులు తీశారు. తాళ్లూరు గంగవరం, రామభద్రాపురం , ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా 5 తీవ్రత కలిగిన భూకంపం ఏర్పడింది. 
 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu earth

Related Articles